బాలికపై గ్యాంగ్ రేప్.. శీలానికి రూ.80వేలు.. సోదరుడిని వెలివేశారు..

సోమవారం, 10 సెప్టెంబరు 2018 (11:12 IST)

బాలికపై సామూహిక అత్యాచారం జరిగితే శీలానికి వెలకట్టారు.. గ్రామ పెద్దలు. బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితులను శిక్షించాల్సిందిపోయి.. ఆ శీలానికి రూ.80వేలు వెలకట్టారు. ఈ దారుణ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలీఘడ్ జిల్లాలో చోటుచేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే.. అలీఘడ్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన 14 ఏళ్ల మైనర్ బాలికను నలుగురు యువకులు నిర్మానుష్య ప్రాంతానికి లాక్కెళ్లి ఆమెపై సామూహిక అత్యాచారం జరిపారు. బాధిత బాలికకు తల్లిదండ్రులు మరణించడంతో సోదరుడు ఒక్కడే ఉన్నాడు. గ్రామ పెద్దలు సమావేశమై అత్యాచారం చేసిన నలుగురు కామాంధులు బాధిత బాలికకు రూ.80వేలు జరిమానాగా చెల్లించాలని పంచాయితీలో తీర్పు చెప్పారు.
 
గ్రామ పెద్దల పంచాయితీపై మండిపడిన బాలిక సోదరుడు... తమకు నష్టపరిహారం అక్కరలేదని, నిందితులకు శిక్ష పడాలని డిమాండ్ చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి నిందితులైన చేతన్ (24), లఖన్ (30), లలిత్ కుమార్ (22), వికాస్ (24)లపై ఐపీసీ సెక్షన్ 376 డి, 354, 506, పోక్సో చట్టాల కింద కేసు నమోదు చేసి, ముగ్గురిని అరెస్టు చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. 
 
పంచాయితీ పెద్దల తీర్పును వ్యతిరేకిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధిత యువతి సోదరుడిపై గ్రామం నుంచి బహిష్కరించారు. కాగా పోలీసులు గ్రామ పెద్దలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

మమ్మీ.. డాడీ ఎక్కడికి వెళ్లారు.. ఎపుడొస్తారు... వెక్కివెక్కి ఏడుస్తున్న జోహ్రా

జమ్మూకాశ్మీర్‌లో 2017లో తీవ్రవాదుల ఏరివేత కోసం జరిపిన ఆపరేషన్‌లో ఏఎస్ఐగా పని చేసిన ...

రాహుల్ గాంధీ మాన‌స్ స‌రోవ‌ర్ యాత్ర - బీజేపికి కాంగ్రెస్ స‌వాల్..!

కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ ప్ర‌స్తుతం కైలాస్ మానస సరోవర్ యాత్రలో ఉన్నారు. ...

హ్యాపీ యానివర్సరీ మామ్ అండ్ డాడ్ : నారా లోకేశ్

ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సోమవారం పెళ్లిరోజు వేడుకలను ...

ఛీ.. ఛీ... మీ అమ్మాయి వాట్సాప్ తెగ చూస్తోంది... మాకొద్దు: ఆగిపోయిన పెళ్లి

ఓ పెళ్లి వాట్సాప్ కారణంగా ఆగిపోయిందంటే నమ్ముతారా? కానీ ఇది నిజం. పెళ్లి మరికొన్ని గంటల్లో ...