Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

గ్రామవేదికపై అమ్మాయిలకు ముద్దులుపెడుతూ.. నృత్యం చేస్తూ అధికారుల మజా...

గురువారం, 20 ఏప్రియల్ 2017 (17:25 IST)

Widgets Magazine
bar dance

వారంతా ప్రభుత్వ ఉద్యోగులు. కానీ, సమస్యల పరిష్కారం కోసం ఓ గ్రామానికి వెళ్లారు. అక్కడ అన్ని పనులు పూర్తి చేసిన తర్వాత గ్రామంలో డీజే కార్యక్రమం ఏర్పాటుచేశారు. ఇందులో అధికారులు పాల్గొన్నారు. పీకలవరకు మద్యం సేవించారు. వేదికపై అమ్మాయిలతో కలిసి డ్యాన్స్ చేశారు. ముద్దులు పెట్టారు. కౌగిలించుకున్నారు. అలా మజా చేసిన అధికారులు చివరకు జిల్లా కలెక్టర్ ఆగ్రహానికి గురికావాల్సి వచ్చింది. 
 
ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గంగాపూర్ గ్రామంలో జరిగింది. యూపీ ప్రభుత్వ ఉద్యోగులైన కౌశిక్, ముఖేష్ కుమార్‌లు ఇద్దరు గంగాపూర్ గ్రామంలో పీకల దాకా తాగి అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన వేదికపై అమ్మాయిలకు ముద్దులు పెడుతూ.. నృత్యం చేశారు. మందు మత్తులో ప్రభుత్వ ఉద్యోగులు చేసిన నిర్వాకంపై తీసిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది. 
 
దీంతో ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి ప్రభుత్వ ఉద్యోగులు తాగి అమ్మాయిలతో తందనాలాడారని ఆగ్రహం చెందిన హాత్రాస్ జిల్లా కలెక్టరు అవినాష్ కృష్ణ సింగ్ ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్ చేశారు. దీంతో మద్యంతాగి అమ్మాయిలతో మజా చేసిన ప్రభుత్వ ఉద్యోగుల మత్తు వదిలినట్లయింది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Dance Government Officers Uttar Pradesh Village Girls

Loading comments ...

తెలుగు వార్తలు

news

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు ఎందుకు తగ్గిపోతున్నారో తెలుసా?

అమ్మా స్కూల్‌కు వెళతా.. ఉండు నాన్నా మంచి ర్యాంక్ సాధించిన ప్రైవేటు స్కూల్లో నిన్ను ...

news

భర్త టెక్కీ... భార్య ఎంబీఏ.. వాట్సాప్‌లో ట్రిపుల్ తలాక్... "విడాకులిస్తున్నా.. మరో మంచి మొగుడు దొరకాలని"..

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ట్రిపుల్ తలాక్ వ్యవహారంపై చర్చ సాగుతోంది. ఈ విధానం వల్ల ముస్లిం ...

news

కుటుంబ కలహాలే కొంపముంచాయి.. భార్య ఆత్మహత్య.. ఆమె లేదని భర్త కూడా?

కుటుంబ కలహాలే ఆ వివాహిత కొంపముంచాయి. పెళ్లైన ఏడాదికే ఆ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ...

news

నవాజ్ షరీఫ్ మెడకు పనామా పేపర్ ఉచ్చు... విచారణకు రావాల్సిందే.. పాక్ సుప్రీంకోర్టు

పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ చిక్కుల్లో పడ్డారు. ఆయన మెడకు పనామా పేపర్స్ లీక్ ...

Widgets Magazine