ప్లీజ్.. ప్రజలు చూస్తున్నారు.. ప్రతి అంశాన్ని రాజకీయం చేయొద్దు.. : వెంకయ్య
శుక్రవారం, 27 నవంబరు 2015 (13:09 IST)
ప్రజాప్రతినిధులు చేసే ప్రతి పనిని ప్రజలు నిశితంగా గమనిస్తున్నారనీ, అందువల్ల ప్రతి అంశాన్ని రాజకీయం చేయొద్దంటూ లోక్‌సభ సభ్యులకు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం లోక్‌సభలో ఆయన మాట్లాడుతూ... విపక్షాలు లేవనెత్తే ప్రతి అంశానికి ప్రభుత్వం సభలో సమాధానమిస్తుదంన్నారు.
దేశమంతా మనల్ని గమనిస్తుందనే విషయం ఎంపీలు గుర్తించాలన్నారు. నవంబరు 26ను రాజ్యాంగ దినోత్సవంగా నిర్వహించుకుంటున్నాం... ఈ సందర్భంగా మన ముందున్న సవాళ్లపై కూలంకషంగా చర్చిద్దామని సభ్యులకు సూచించారు. సవాళ్లను ఎలా ఎదుర్కోవాలనే దానిపై చర్చలు జరుపుదామన్నారు.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సాధారణ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి.... అలాంటి అంబేద్కరర్ జీవితంలో ఎన్నో సమస్యలు, సవాళ్లు అధిగమించారన్నారు. బ్రిటీష్ పాలన సమయంలో దేశ పునర్నిర్మాణానికి అంబేద్కర్ కృషి చేశారని గుర్తుచేశారు. రాజ్యాంగాన్ని బలోపేతం చేయడంలో కీలకపాత్ర పోషించారని కొనియాడారు. ప్రజలకు స్వేచ్ఛ అనేది చాలా ముఖ్యమని అంబేద్కర్ ఉద్బోధించారని, ఆయన చూపిన మార్గంలో ప్రతి ఒక్కరం నడుద్దామని వెంకయ్య పిలుపునిచ్చారు.
Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :
,
,
,