Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అమ్మ పేరు ఇక కనుమరుగు.. వేదనిలయం చిన్నమ్మ బంధువులకేనా? స్మారకమందిరం అవుతుందా?

గురువారం, 16 ఫిబ్రవరి 2017 (12:47 IST)

Widgets Magazine
jayalalithaa

దివంగత ముఖ్యమంత్రి జయలలితను ఆరాధించే అన్నాడీఎంకే నేతలు చాలా ఎక్కువ. కార్యకర్తల నుంచి ఉన్నత స్థాయి నేతల వరకు అమ్మ ఆరాధన లేనిదే ఏ పనిచేయరు. ప్రస్తుతం అధికారం కోసం ప్రయత్నిస్తున్న అన్నాడీఎంకె శాసనసభాపక్ష నేత పళనిస్వామి, ఆపద్దర్మ సీఎం పన్నీర్ సెల్వం తాము అధికారంలోకి వస్తే అమ్మ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామని హామిలిస్తున్నారు. 
 
కానీ ప్రస్తుతం అమ్మ ఫోటోను సంక్షేమ పథకాలను పెట్టడం కానీ.. ఆమె ఫోటోను ఉపయోగించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సుప్రీం దోషిగా తేల్చిన వ్యక్తి ఫోటోను ప్రభుత్వ కార్యక్రమాల్లో, పథకాల్లో ఉపయోగించవచ్చా? అన్నదే ప్రస్తుతం సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోన్న అంశం.
 
మరోవైపు నిన్నటిదాకా అమ్మకు భారతరత్న ఇవ్వాలని.. పార్లమెంట్ ఆవరణలో ఆమె విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని వినిపించిన డిమాండ్స్‌కు జీవం లేకుండా పోయింది. దోషిగా తేలిన వ్యక్తికి ఇలాంటి గౌరవాలు దక్కాలని కోరడం కూడా రాజ్యాంగ విరుద్దమే అవుతుంది.

ఇక మెరీనా బీచ్‌లోని అమ్మ సమాధిని స్మారక కేంద్రంగా ఏర్పాటు చేయాలనుకుంటున్న తరుణంలో.. ఆమెను కోర్టు దోషిగా ప్రకటించడంతో ప్రభుత్వ నిధులను కూడా ఇందుకోసం వెచ్చించే పరిస్థితి లేదు. మొత్తానికి సుప్రీం కోర్టు నిర్ణయం అమ్మ పట్ల అభిమానం చాటుకోవాలనుకునేవారికి ప్రతికూలంగా మారిందనే చెప్పాలి.
 
ఇదిలా ఉంటే.. అక్రమాస్తుల కేసులో శిక్ష పడి బెంగుళూరు పరప్పణ అగ్రహారం జైలు జీవనం గడుపుతున్న శశికళకు బుధవారం రాత్రంతా నిద్రపట్టలేదట. గురువారం తెల్లవారు జామున 4 గంటలకే నిద్రలేచిన చిన్నమ్మకు.. జైలు సిబ్బంది శశికు 6-30 గంటలకు టీ, 7-00 గంటలకు టిఫిన్ అందజేశారు. ఆపై కాసేపు తమిళ పత్రికలతోపాటు ఇంగ్లీష్, కన్నడ పత్రికలను చిన్నమ్మ చదివారు. 
 
గతంలో జయ, శశి ఇదే జైల్లో ఉన్నప్పుడు అగరబత్తీలు, కొవ్వొత్తులు తయారు చేశారు. చిన్నమ్మకు ఇప్పుడు కూడా అదే పనిని అప్పగించారు. బుధవారం సాయంత్రం 6 గంటల సమయంలో జైల్లోకి వెళ్లిన శశికళ సాధారణ ఖైదీగానే శిక్ష అనుభవిస్తున్నారు. చిన్నమ్మకు మూడు చీరలు, ఒక చెంబు, ప్లేటు, దుప్పటిని జైలు సిబ్బంది కేటాయించారు. శశికళ ఆమె మరదలు ఇళవరసితోపాటు మరో ఖైదీ కూడా బ్యారక్‌లో ఉన్నారు.

ఇదిలా ఉంటే.. వేదనిలయాన్ని అమ్మ స్మారక మందిరంగా ఏర్పాటు చేస్తామని పన్నీర్ చేసిన ప్రకటన ఏమవుతుంది..? పోయెస్ గార్డెన్‌లో చిన్నమ్మ బంధువులే ఉంటారా? పళని స్వామి సీఎం అయ్యాక వేదనిలయాన్ని ఏం చేస్తారు అనేది సస్పెన్స్‌గా మారింది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

మా కర్మకాకపోతే... ఓటేసి ఎమ్మెల్యేల్ని ఎన్నుకుంటే.. చిన్నమ్మకు సపోర్ట్ చేస్తారా? చిన్నమ్మ చికెన్ పీస్‌కు?

దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణానికి తర్వాత ఆమె విధేయుడు ఓపీఎస్ పార్టీని నడిపిస్తాడని, ఆయనే ...

news

ఇక నేనొక మాజీ సీఎం... ప్రజాసేవ చేసుకుంటూ బతుకుతా... పన్నీర్ సెల్వం

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం కాడి పడేశారు. ఇక నుంచి తాను ఒక మాజీ ...

news

చిన్నమ్మ కీలుబొమ్మ పళనికి ఎమ్మెల్యేల మద్దతు.. ప్రజాభిప్రాయం ఉన్నా పన్నీరుకు కన్నీరు..

తమిళనాడులో ఏర్పడిన రాజకీయ సంక్షోభానికి తెరపడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దివంగత ...

news

గోల్డెన్ బే రెసార్ట్.. పళని స్వామిదే.. సోషల్ మీడియా జోకే నిజమైంది.. ఎలాగో తెలుసా?

గోల్డెన్ బే రెసార్ట్ గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రెసార్ట్‌లో శశికళ వర్గం ...

Widgets Magazine