శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 22 సెప్టెంబరు 2014 (14:24 IST)

శశికపూర్‌కి తీవ్ర అస్వస్థత: చెస్ట్ ఇన్ఫెక్షన్‌తో..

అలనాటి బాలీవుడ్ అందాల కథానాయకుడు శశి కపూర్ (76) తీవ్ర అస్వస్థతకి గురైయ్యారు. తీవ్రమైన దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కారణంగా గత రాత్రి ఆయనను ముంబయిలోని కోకిలాబెన్ ధీరూబాయ్ అంబానీ ఆసుపత్రిలో చేర్చారు. 
 
ప్రస్తుతం కపూర్ ఐసీయూలో వైద్యుల అబ్జర్వేషన్‌లో ఉన్నారని, పరిస్థితి నిలకడగా ఉందని ఆసుపత్రి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ రామ్ నరైన్ తెలిపారు. 
 
బాలీవుడ్‌లో 160 పైగా చిత్రాల్లో నటించిన శశి... 'దీవార్', 'సిల్ సిలా', 'సత్యం శివం సుందరం' సినిమాలతో సత్తా ఉన్న నటుడిగా పేరొందారు. గతంలో ఆయన బైపాస్ సర్జరీ కూడా చేయించుకున్నారు.