గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 1 అక్టోబరు 2014 (17:53 IST)

వయాగ్రా వాడుతున్నారా? తస్మాత్ జాగ్రత్త!! కళ్లుపోతాయ్!!

వయాగ్రా ఎక్కువ కాలం వాడితే కంటి చూపు దెబ్బతింటుందని పరిశోధనలలో వెల్లడైంది.  శృంగార సమస్యలకు వయాగ్రా పరిష్కారమైనా... కంటికి ముప్పు తప్పదని వైద్య నిపుణులు అంటున్నారు. 
 
దీని సామర్థ్యంపై, దీని వాడకం వల్ల వచ్చే అనర్థాలపై ఎన్నో పరిశోధనలు జరిగాయి. వయాగ్రా వాడితే కంటి చూపు దెబ్బతింటుందని తాజాగా పరిశోధకులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
 
అయితే అందరికీ కంటి చూపు దెబ్బతినే అవకాశం లేదని, ఒక రకమైన మ్యూటేషన్ ఉన్నవారికి, రెటీనా నుంచి మెదడుకు కాంతి సంకేతాలను పంపే ఒక ఎంజైమ్‌ను సిల్డెనాఫిల్ అడ్డుకుంటుందని పరిశోధకులు తెలిపారు. 
 
వయాగ్రాను మరీ ఎక్కువ డోసుల్లో ఉపయోగించే వారికి కంటిపరమైన సమస్యలు రావచ్చన్న విషయం గతంలో కూడా నిర్ధారణ అయిందని పరిశోధకులు వెల్లడించారు. 
 
వయాగ్రా ఉపయోగించే వారికి... ఎక్కువ కాంతిని చూడలేకపోవడం, చూపు మందగించడం, రంగులు కూడా వేరేగా కనపడడం లాంటి సమస్యలు రావచ్చని పరిశోధకులు స్పష్టం చేశారు.