గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: బుధవారం, 1 అక్టోబరు 2014 (18:57 IST)

వయాగ్రా వాడితే కళ్ళు కెవ్వు కెవ్వు కాదు పోవు పోవు

వయాగ్రా ఎక్కువ కాలం వాడితే కంటి చూపు కెవ్వు కెవ్వు కాదు కానీ పోతుందని పరిశోధనలలో వెల్లడయింది. వయాగ్రా మందును వాడేవాళ్ళపై చేసిన పరిశోధనలో తేలిందేంటయా అంటే ఇది కొందరికి మాత్రమే చేటు చేస్తుందట. ఒక రకమైన మ్యుటేషన్ ఉన్నవాళ్లకు మాత్రమే ఇలా జరుగుతుందనీ, రెటీనా నుంచి మెదడుకు కాంతి సంకేతాలను పంపే ఒక ఎంజైమును సిల్డెనాఫిల్ అడ్డుకుంటుందని తేలింది. 
 
వయాగ్రాను మరీ ఎక్కువ డోసుల్లో తీసుకునేవారిలో కంటి సమస్యలు ఖచ్చితంగా తలెత్తుతాయని అంటున్నారు. వయాగ్రా ఉపయోగించే వారికి... ఎక్కువ కాంతిని చూడలేకపోవడం, చూపు మందగించడం, రంగులు కూడా వేరేగా కనపడడం లాంటి సమస్యలు రావచ్చని పరిశోధకులు స్పష్టం చేశారు.