ఇంకా పెళ్లికాలేదు.. అలాగనీ నేను నపుంసకుడినికాను.. హార్దిక్ పటేల్

మంగళవారం, 14 నవంబరు 2017 (08:38 IST)

hardik patel

గుజరాత్‌ టీవీ చానెళ్లలో పటీదార్‌ ఉద్యమ నేత హార్ధిక్‌ పటేల్‌ రాసలీలలంటూ ప్రసారమైన వీడియోపై ఆయన ఘాటుగా స్పందించారు. తనకు ఇంకా పెళ్లి కాలేదని.. అలాగని నపుంసకుడిని కాదంటూ ఘాటుగానే బదులిచ్చారు. తనకు చెడ్డపేరు రావడానికి భారతీయ జనతా పార్టీ చిల్లర రాజకీయాలకు పాల్పడుతోందని ఆయన మండిపడ్డారు. ఆ వీడియోలో ఉన్నది తాను కాదని.. దీన్ని ఇతర దేశాల నుంచి అప్‌లోడ్‌ చేశారని, అదొక ఫేక్‌ వీడియో అంటూ వివరణ ఇచ్చారు. 
 
తమ ఉద్యమం వల్ల బీజేపీకి అపారనష్టం వాటిల్లనుందని, అందువల్లే ఈ తరహా కుటిల రాజకీయాలకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు. ముఖ్యంగా, తమను, తమ ఉద్యమాన్ని రాజకీయంగా దెబ్బతీసేందుకు బీజేపీ ఇలాంటి చీప్‌ ట్రిక్స్‌ ప్లే చేస్తుందని ఫైర్‌ అ‍య్యారు. మార్ఫింగ్‌తో తనపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని, ఇలాంటి కుట్ర తనపై జరుగుతుందని గతంలోనే తెలిపానని గుర్తు చేశారు. ఈ వీడియోపై న్యాయపరంగా పోరాటం చేస్తానన్నారు.
 
కాగా, 4 నిమిషాల వ్యవధి ఉన్న ఆ వీడియోలో ఓ మహిళతో 2017 మే 16న హార్ధిక్ పటేల్‌ను పోలిన వ్యక్తి రాసలీలలు జరిపినట్లు ఓ హోటల్‌ సీసీ కెమెరాల్లో రికార్డైంది. ఇక పటీదార్‌ ఉద్యమనేత అయిన హార్ధిక్‌ పటేల్‌ గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించిన విషయం తెల్సిందే. దీంతో ఆయన ఉన్నట్టుగా ఉండే రాసలీలల వీడియో ఒకటి మరోమారు తెరపైకి వచ్చింది. దీనిపై మరింత చదవండి :  
Viral Gujarat Video Clip Hardik Patel Cries Foul

Loading comments ...

తెలుగు వార్తలు

news

బెల్ట్ షాపులున్నాయని చెబితే అర్థగంటలో మూయించేస్తాం: మంత్రి జవహర్

అమరావతి: రాష్ట్రంలో 100 శాతం బెల్ట్ షాపులు మూయించామని ఎక్సైజ్ శాఖ మంత్రి మంత్రి ...

news

వాణీ విశ్వనాథ్‌ను చూసి రోజా బెదుర్సా? పుట్టినరోజు నాడు నిరుద్యోగులకు బంపర్ ఆఫర్...

ఫైర్ బ్రాండ్ రోజా తన పుట్టినరోజున నిరుద్యోగులకు ఒక బంపర్ ఆఫర్ ఇవ్వాలని నిర్ణయానికి ...

news

పోలవరం బోట్లో 150 మంది ఎక్కుతారు... కానీ... ఎమ్మెల్సీ సోము వీర్రాజు

అమరావతి: రాష్ట్రంలోని పర్యాటక శాఖలో బోట్లను తనిఖీ చేసి, వాటి పనితీరుని సమీక్షించే ...

news

మహిళా హోంగార్డుతో మసాజ్ చేయించుకుంటూ అడ్డంగా దొరికిన ఏఎస్ఐ

విశాఖపట్టణంలోని జోగులాంబ గద్వాల జిల్లాలో మహిళా హోంగార్డుతో మసాజ్ చేయించుకుంటూ ఏఎస్ఐ హసన్ ...