శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By tj
Last Updated : ఆదివారం, 19 ఫిబ్రవరి 2017 (14:39 IST)

చెన్నైకు శశికళ... 20న పిటిషన్ దాఖలు.. చెన్నై లేదా వేలూరు జైలుకు మార్చండి

కర్ణాటక రాష్ట్రంలోని పరప్పణ అగ్రహార చెర నుంచి చెన్నై లేదా వేలూరు జైలుకు చిన్నమ్మ శశికళ అండ్ బృందాన్ని త్వరలో మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో అధికారం తమ చేతికి చిక్కడంతో ఇక చిన్నమ్మ క్షేమాన

కర్ణాటక రాష్ట్రంలోని పరప్పణ అగ్రహార చెర నుంచి చెన్నై లేదా వేలూరు జైలుకు చిన్నమ్మ శశికళ అండ్ బృందాన్ని త్వరలో మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో అధికారం తమ చేతికి చిక్కడంతో ఇక చిన్నమ్మ క్షేమాన్ని కాంక్షించే రీతిలో పావులు కదిపే పనిలో పడ్డారు. సోమవారం కర్ణాటక హైకోర్టులో పిటిషన్‌ దాఖలుకు కసరత్తులు జరుగుతున్నాయి. అక్రమాస్తుల కేసులో శిక్ష పడటంతో అన్నాడిఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి చిన్నమ్మ శశికళ, బంధువులు ఇళవరసి, సుధాకరన్ బెంగుళూరు పరప్పణ అగ్రహారం చెరలో ఉన్నారు.
 
మధుమేహం, మోకాళ్ళ నొప్పులతో శశికళ బాధపడుతున్నారు. ఆమెకు ఆ చెరలో ఎలాంటి ప్రత్యేక వసతులు లేని దృష్ట్యా, జైలును మార్చేందుకు తగ్గ కసరత్తులో రాష్ట్ర పాలకులు కసరత్తుల్ని వేగవంతం చేశారు. బలనిరూపణలో నెగ్గడంతో అధికారం తమదేనన్నది ఖరారు కావడంతో ఇక చెరలో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న చిన్నమ్మను చెన్నై లేదా వేలూరు జైలుకు మార్చి శిక్ష అనుభవించేలా చేయడానికి చర్యల్ని వేగవంతం చేశారు.
 
ఇప్పటికే ఇద్దరు న్యాయవాదులు చిన్నమ్మ శశికళతో సంప్రదింపులు జరిపి, అందుకు తగ్గ ప్రయత్నాలను వేగవంతం చేసి ఉన్నారు. తాజాగా రాష్ట్ర పాలకులు తమ ప్రయత్నంగా చేయడానికి నిర్ణయించినట్లు సంకేతాలు వెలువడ్డాయి. ఇందుకు అద్దం పట్టే విధంగా హైకోర్టులో పిటిషన్‌ దాఖలకు న్యాయవాదులు చర్యలు తీసుకుని ఉండడం గమనార్హం. వయోభారం, ఆరోగ్య సమస్యల్ని పరిగణలోకి తీసుకోవడంతో పాటు తమిళనాడు నుంచి బెంగుళూరుకు అన్నాడిఎంకే వర్గాలు ఇక పోటెత్తే అవకాశం ఉందన్న విషయాన్ని కోర్టు ముందు ఉంచేందుకు ఆ పిటిషన్‌ సిద్ధం చేసి ఉన్నట్లు సమాచారం.
 
బలనిరూపణలో విజయంతో తమ చిన్నమ్మను ప్రసన్నం చేసుకునేందుకు భారీ ఎత్తున ఇక్కడి నుంచి మద్థుతు దారులు, మంత్రులు సీఎంతో కలిసి పరప్పణ కాస్త కర్ణాటక భద్రత వర్గాలు మున్ముందు సమస్యలు తమకెందుకు అన్న నిర్ణయానికి వచ్చే రీతిలో సాగించేందుకు కసరత్తులు చేసి ఉన్న సమాచారాన్ని బట్టి చూస్తే త్వరలో చిన్నమ్మ జైలు మారడం ఖాయం అన్న ధీమాను మద్థతుదారులు వ్యక్తం చేస్తున్నారు.