Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

జయలలిత వల్లే మాకు ఈ కష్టాలు : దివాకరన్

సోమవారం, 20 నవంబరు 2017 (13:58 IST)

Widgets Magazine

తమిళనాడు ముఖ్యమంత్రి దివంగత జయలలిత మరణం తర్వాత మన్నార్గుడి మాఫియా ఎక్కడలేని కష్టాలను అనుభవిస్తోంది. ముఖ్యంగా, శశికళ కుటుంబ సభ్యులు కష్టాలు అన్నీఇన్నీకావు. ఈ కష్టాలపై శశికళ సోదరుడు దివాకరన్ స్పందించారు.
jayalaltihaa
 
తమిళనాట తమపై వరుసగా జరుగుతున్న దాడులకు జయలలితే కారణమని ఆరోపించారు. తాను మరణించిన తర్వాత శశికళ పరిస్థితి ఏంటన్న విషయాన్ని జయలలిత ఎంతమాత్రమూ పట్టించుకోలేదని, అందువల్లే ఇప్పుడీ పరిస్థితి దాపురించిందని వ్యాఖ్యానించారు.
 
జయలలిత తప్పిదాలే తమ పాలిట శాపాలుగా మారాయని ఆరోపించారు. శశికళను పూర్తిగా వాడుకున్న జయలలిత, ఆమె క్షేమం కోసం ఏమీ చేయలేదని, ఫలితంగానే ఆమె ఇపుడు జైల్లో మగ్గుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
 
శశికళ కుటుంబీకులు చేసిన మోసం కారణంగానే జయలలితపై కేసు నమోదైందని వస్తున్న ఆరోపణలపై స్పందిస్తూ, అదే జరిగి, మేమే అమ్మను మోసం చేసుంటే, ఆమె దోషిగా ఎలా తేలిందని మీడియాను దినకరన్ ఎదురు ప్రశ్నించారు. జయలలిత మరణం తర్వాత తమ కుటుంబానికి కష్టాలు వచ్చాయన్న విషయం ప్రతి ఒక్కరికీ తెలుసునని అన్నాడు.
 
'అమ్మ'తో కలిసున్న కారణంగానే శశికళ, ఇళవరసి, సుధాకరన్‌లు జైల్లో మగ్గాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. అక్రమాస్తుల కేసులో ప్రధాన ముద్దాయి అమ్మేననే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలంటూ సూచన చేశారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

మోడీ సర్కారును 74 శాతం మంది నమ్ముతున్నారట.. ఇక తిరుగులేదా?

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్కారును 74 శాతం మంది భారతీయులు నమ్ముతున్నారట. ఆర్గనైజేషన్ ఫర్ ...

news

మగవారిని చంపడమే లక్ష్యంగా చంద్రబాబు : ఆర్కే. రోజా

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైకాపా ఎమ్మెల్యే ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. ...

news

రాంగ్ రూటులో వచ్చిన కారు ముందు బైకుతో నిలబడి? (వీడియో)

రాంగ్ రూటులో వచ్చిన ఓ కారు ముందు నిలబడి.. ఆ కారు డ్రైవరుకు చుక్కలు చూపించిన ఓ యువకుడు ...

news

యూఎస్‌లో చెన్నై మహిళకు అరుదైన గౌరవం

అమెరికాలో చెన్నై మహానగరానికి చెందిన ఓ మహిళకు అరుదైన గౌరవం లభించింది. 38 యేళ్ళ షిఫాలి ...

Widgets Magazine