మరో నాలుగు రోజులు ఓపిక పట్టండి: రజనీకాంత్

గురువారం, 28 డిశెంబరు 2017 (08:58 IST)

rajinikanth

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ ప్రవేశంపై ప్రస్తుతం వాడీవేడీగా చర్చ సాగుతోంది. డిసెంబర్ 31వ తేదీన రజనీకాంత్ తన రాజకీయ ప్రవేశంపై  కార్యాచరణ ప్రారంభించనున్నట్లు ప్రకటించిన తరుణంలో మరోసారి అభిమానుల సమావేశంలో రజనీకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు.
 
తాను పదే పదే ఒకే విషయాన్ని చెబుతున్నానని ఎవరూ విసుక్కోవద్దని.. తొలుత కుటుంబం, ఆ తరువాతే మరెవరి గురించైనా ఆలోచించాలని అభిమానులకు పిలుపునిచ్చారు. మరో నాలుగు రోజులు ఓపిక పట్టాలని, తాను అన్ని విషయాలూ చెబుతానని వెల్లడించారు. ఇంకా మాట్లాడుకోవాల్సింది చాలా వుందని, ప్రతి ఒక్కరికీ వాళ్ల పిల్లలే ఆస్తి అన్నారు. పిల్లలను చదివించుకోవాలని.. తల్లిదండ్రులను గౌరవించాలని ఫ్యాన్స్‌కు సలహా ఇచ్చారు.
 
అంతకుముందు మంగళవారం చెన్నై కోడంబాక్కంలోని రాఘవేంద్ర కళ్యాణ మండపంలో అభిమానులతో సమావేశమైన రజనీకాంత్ రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధరంగంలోకి దిగితే గెలిచే తీరాలని రజనీకాంత్ అన్నారు. అందుకు జనాకర్షణ ఒక్కటే సరిపోదని, పక్కా ప్లాన్ ఉండాలని కూడా ఆయన భావిస్తున్నారు. ఇకపోతే, రజనీకాంత్ తమిళనాడులో సొంత పార్టీయే పెడుతారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఇతర పార్టీలతో పొత్తు కూడా ఉండదని సమాచారం. దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

జనసేన సలహాదారుగా జయప్రకాష్‌ నారాయణ్?

ప్రత్యక్ష ఎన్నికల్లోకి వెళ్ళి చివరకు లోక్ సత్తా పార్టీ చతికిలపడిన విషయం తెలిసిందే. ప్రజలు ...

news

మంత్రి అనుచరుడి కబ్జా బాగోతం... 10 కోట్ల స్థలంపై కన్ను... ఎక్కడ?

అధికార పార్టీ అంటే అంతేమరి. ప్రతి చోటా నాయకుడు కూడా తన మాటే చెల్లుబాటు కావాలనుకుంటాడు. ...

news

రియల్ టైమ్ గవర్నెన్స్‌లో ఏపీ భేష్... బాబుకు రాష్ట్రపతి ప్రశంస

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రియల్ టైమ్ గవర్నెన్స్ అనే వినూతన్న కార్యక్రమానికి ...

news

పాపను చూసేందుకు ఆదివారం ఇంటికొచ్చి ఇబ్బంది పెట్టేవాడు: వనితా రెడ్డి

హాస్య‌న‌టుడు విజ‌య్ ఆత్మ‌హ‌త్య కేసులో ఆయన సతీమణి వనితా రెడ్డి పోలీసుల ముందు లొంగిపోయింది. ...