Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అన్నాడీఎంకే నేత దారుణ హత్య.. కత్తితో పొడిచి చంపేశారు.. రాజకీయ కారణాలు కాదట

ఆదివారం, 12 ఫిబ్రవరి 2017 (18:17 IST)

Widgets Magazine
murder

తమిళనాట చోటుచేసుకున్న రాజకీయ సంక్షోభం నేపథ్యంలో పట్టపగలు నడిరోడ్డు పైన అన్నాడీఎంకే పార్టీ నాయకుడిని హత్య చేశారు. సహచరులతో ఆస్తి వివాదాలే హత్యకు కారణమని తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. హత్యకు గురైన వ్యక్తి కనగరాజ్ (40).. అన్నాడీఎంకే పార్టీ తిరువన్నామలై నగర నాయకుడు. అతను కొద్ది నెలల క్రితం వరకు టౌన్ సెక్రటరీగా పనిచేశాడు. 
 
ఆదివారం ఉదయం రోడ్డుపై వెళ్తుండగా ఆయుధాలతో వచ్చిన ముగ్గురు అతనిని హతమార్చారు. ఈ దాడికి రూ.3 కోట్ల లావాదేవీలు కారణమని గుర్తించినట్లు పోలీసులు చెప్పారు. ఇందులో రాజకీయ కారణాలు లేవని పోలీసులు తెలిపారు. కాపు కాసి ముగ్గురు కారులో వచ్చి కత్తితో పొడిచి ఘాతుకానికి పాల్పడ్డారని పోలీసులు చెప్పారు. కనగరాజ్ సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. 
 
కాగా, హత్య చేసిన వారు ప్రతిపక్ష డీఎంకే మద్దతుదారులుగా చెబుతున్నారు. ఇదిలా ఉండగా.. ఆయన మృతి పట్ల అన్నాడీఎంకే అధినేత్రి శశికళ ప్రగాడ సానుభూతి తెలిపారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

అమ్మను చిన్నమ్మ ఏమీ చేయలేదు.. శశికళ మెజార్టీ ఎమ్మెల్యే మద్దతు ఉంది: నర్సు

అన్నాడీఎంకే అధినేత్రి జయలలితను చిన్నమ్మ శశికళ ఏదో చేసి ఉండవచ్చంటూ వస్తున్న ...

news

మన కట్టుబాట్లు స్త్రీలను పురుషుడికి బానిసగా మార్చాయి: జయసుధ

విజయవాడలో జరుగుతున్న పార్లమెంటీరియన్‌ సదస్సులో సినీ నటి జయసుధ మాట్లాడుతూ.. లింగ వివక్ష ...

news

సీఎం పదవి దక్కకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటానా? అవన్నీ ఉత్తుత్తివే: చిన్నమ్మ

తమిళ రాజకీయాలు క్షణక్షణం మారుతున్నాయి. అధికార అన్నాడీఎంకే పార్టీలో చీలికలు ఏర్పడ్డాయి. ...

news

రోజాను ఆహ్వానించి అడ్డుకుంటారా? పోరాడుతామన్న జగన్.. కంటతడి పెట్టిన రోజా

వైకాపా ఎమ్మెల్యే మీడియా ముందు కంటతడి పెట్టారు. అమరావతిలో జరుగుతున్న మహిళా పార్లమెంట్ ...

Widgets Magazine