గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 27 ఆగస్టు 2015 (17:34 IST)

జీఎస్ఎల్వీ-డీ6 (జీశాట్-6) ప్రయోగం సక్సెస్: షార్ నుంచి నింగికెగసిన ఉపగ్రహం..

ఎన్‌ బ్యాండ్ ద్వారా సమాచార రంగంలో ఆధునిక సేవలందించే లక్ష్యంతో జీశాట్-6 ఉపగ్రహాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) విజయవంతంగా ప్రయోగించింది. నెల్లూరు జిల్లా శ్రీహరి కోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) కేంద్రం నుంచి జీఎస్ఎల్వీ డీ6 వాహననౌక ద్వారా ఉపగ్రహాన్ని గురువారం సాయంత్రం 4.52 గంటలకు ప్రయోగించింది. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తం చేశారు. 
 
ఈ రాకెట్ ప్రయోగానికి ముందుగా జరిగే కౌంట్‌డౌన్ బుధవారం మధ్యాహ్నం 11.52 గంటలకు ప్రారంభమంది. 29 గంటల పాటు కౌంట్‌డౌన్ పూర్తయ్యాక జీఎస్ఎల్‌వీ నింగిలోకి దూసుకెళ్లింది. ఇప్పటివరకు భారత్ 24 సమాచార ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపింది. 
 
2001, 2003, 2004, 2007, 2014లో జీఎస్ఎల్వీ రాకెట్లను ప్రయోగించింది. ప్రస్తుతం పంపిన ఉపగ్రహం జీశాట్-6ను స్వదేశీ క్రయోజనిక్ ఇంజిన్‌తో 2,117 కిలోలతో నింగికెగసింది. ఈ ప్రయోగం ద్వారా దేశ సమాచార వ్యవస్థలో ట్రాన్స్‌పాండర్ల కొరత తీరనుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.