మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 4 మార్చి 2015 (10:55 IST)

''అధ్యక్షా, నేను పార్లమెంటుకు కొత్త. నన్ను రక్షించండి'': మోడీ

‘‘అధ్యక్షా, నేను పార్లమెంటుకు కొత్త. నన్ను రక్షించండి’’ అంటూ  ప్రధాని నరేంద్ర మోడీ, రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీని వేడుకున్నారు. అయినా మోడీకి అంత ఇబ్బందేం వచ్చిందనేగా మీ సందేహం? దేశ రాజకీయాల్లో కాకలు తీరిన ఎస్పీ నేత శరద్ యాదవ్, బీఎస్పీ అధినేత్రి మాయావతిలు ఒకేసారిగా మోడీపై దాడికి దిగారు.
 
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంలో భాగంగా  రాజ్యసభలో మాట్లాడుతున్న మోడీని శరద్, మాయావతి అడ్డుకున్నారు. దీంతో ఒక్కసారిగా సెల్ఫ్ డిఫెన్స్‌లో పడ్డ మోడీ, అన్సారీని ఉద్దేశించి సదరు వ్యాఖ్యలు చేశారు. ఇలా అవసరం లేకున్నా, సెల్ఫ్ డిఫెన్స్ వ్యాఖ్యలు చేసిన మోడీ... సమ్మిళిత వృద్ధిపై శరద్, కార్పొరేట్ రంగంలో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లపై మాయావతి సంధించిన ప్రశ్నలకు సమాధానాలను ఉద్దేశపూర్వకంగానే దాటవేశారు.