Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

మీకు 124 మంది ఎమ్మెల్యేలు.. మాకు ఏడు కోట్ల తమిళుల అండ అన్న సెల్వం

హైదరాబాద్, శుక్రవారం, 17 ఫిబ్రవరి 2017 (03:02 IST)

Widgets Magazine
panneer selvam

ఎంజీఆర్‌ స్థాపించిన, కృషితో ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న అన్నాడీఎంకే పార్టీ, ప్రభుత్వం నేడు ఆమె కుటుంబ సభ్యుల సొత్తుగా మారిందని మాజీ సీఎం పన్నీర్ సెల్ం ఆవేదన వ్యక్తంచేశారు.  తమిళనాడులో శశికళ కుటుంబపాలనను నిర్మూలించి, అమ్మ ప్రభుత్వ ఏర్పాటుకు పాటుపడతానని మాజీ సీఎం పన్నీర్‌సెల్వం జయలలిత సమాధి సాక్షిగా శపథం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది శశికళ ప్రభుత్వమని ఆయన వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో ప్రజాభీష్టానికి అనుగుణంగా ఎమ్మెల్యేలు ఓటు వేసేలా శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు, ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. గురువారం రాత్రి ఏడు గంటల ప్రాంతంలో పన్నీర్‌సెల్వం తన మద్దతుదారులతో మెరీనా బీచ్‌లోని జయ సమాధి వద్దకు చేరుకుని శ్రద్ధాంజలి ఘటించారు.
 
ఈ సందర్భంగా పన్నీర్ సెల్వం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఏర్పడిన దౌర్భాగ్య పరిస్థితిని అన్ని నియోజకవర్గాల ప్రజలకు వివరించి ఎమ్మెల్యేలను జాగృతం చేస్తామన్నారు. శశికళ శిబిరంపై ధర్మయుద్ధం చేయనున్నామని ప్రకటించారు. 124 మంది ఎమ్మెల్యేలు పళనిస్వామి వైపుంటే ఏడుకోట్ల మంది తమిళనాడు ప్రజలు తమవైపు ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు.  
 
శశికళ మద్దతుదారు పళనిస్వామిని ముఖ్యమంత్రిగా తమిళనాడు గవర్నర్ విద్యాసాగరరావు ప్రమాణస్వీకారం చేయించడంతో  ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పదవిని కోల్పోయి మాజీ అయిపోయిన పన్నీర్ సెల్వం ఇక తాను పదవులు లేని ప్రజాజీవితం గడుపుతానని, రాష్ట్రమంతటా తిరిగి జయలలిత మృతిలో శశిపాత్ర గురించి చెబుతానని ప్రకటించారు. 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

పేరుకు విశ్వనగరమని గప్పాలు: రాజధాని నడిబొడ్డున ఉద్యోగిని దారుణహత్య

విశ్వనగరంగా గప్పాలు కొట్టుకుంటున్న తెలంగాణ రాజధానిలో మరో ఘోరం జరిగింది. టెలికాలర్‌గా ...

news

ఆహారం ముట్టని శశికళ : తొలిరోజు జైలు జీవితం ఇలా ముగిసింది

బుధవారం ఉదయంనుంచి పచ్చి మంచినీళ్లయినా ముట్టకుండా చెన్నై మెరీనా తీరంలోని జయలలిత సమాధి ...

news

గూగుల్‌ సీఈఓనే ఉద్యోగం అడిగిన చిన్నారి: అలాగే అన్నసుందర్‌పిచాయ్‌

గూగుల్‌ సంస్థలో ఉద్యోగం చేయడం ప్రపంచ వ్యాప్తంగా కొన్ని లక్షలమంది ఏటా కనే కల. ఆ కల నిజమైతే ...

news

జయ సమాధి వద్ద పన్నీర్ సెల్వం నివాళులు... ప్రభుత్వాన్ని తరిమేస్తామంటూ...

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అమ్మ నమ్మినబంటు పన్నీర్ సెల్వం గురువారం నాడు జయలలిత సమాధి వద్ద ...

Widgets Magazine