Widgets Magazine Widgets Magazine

మోడీ దీవెనలు చిన్నమ్మకు కలిసిరాలేదా? అబ్బే.. ఇలా జరిగిపోయిందేమిటి?

బుధవారం, 19 ఏప్రియల్ 2017 (17:57 IST)

Widgets Magazine
sasikala - modi

దివంగత ముఖ్యమంత్రి జయలలిత లేని లోటు తమిళనాట స్పష్టంగా తెలిసిపోతుంది. డీఎంకే పార్టీ కురువృద్ధుడు, మాజీ సీఎం కరుణానిధి కూడా అనారోగ్యం నుంచి మెల్ల మెల్లగా కోలుకుంటుండంతో రాజకీయ తంత్రాలకు చోటులేకుండా పోయింది. దీంతో అధికారం చేతిలో లేకపోవడంతో కరుణ తనయుడు స్టాలిన్ కూడా మిన్నకుండిపోయారు.

ఈ నేపథ్యంలో అమ్మ మరణానికి అనంతరం పన్నీర్ సీఎం అయినా.. చిన్నమ్మే అంతా తానై చూసుకుంది. పార్టీని, తమిళ రాష్ట్రాన్ని శాసించాలనుకుంది. కానీ ఇంతలోనే అక్రమాస్తుల కేసు, పన్నీర్ సెల్వం తిరగబడటంతో చిన్నమ్మ జైలుకు వెళ్లిపోయింది. 
 
ప్రస్తుతం దినకరన్ కూడా రెండాకుల చిహ్నం కోసం ఈసీ లంచం ఇవ్వజూపారనే కేసులో ఇరుక్కున్నాడు. దీంతో ఓపీఎస్-పళని సామి వర్గాలు చేతులు కలిపేందుకు రెడీ అయ్యాయి. అలాగే చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకుని.. అమ్మ ఆశయాలను నెరవేర్చేందుకు అన్నాడీఎంకే పార్టీని, రెండాకుల చిహ్నాన్ని సొంతం చేసుకునేందుకు సన్నద్ధమైనాయి. అంతేగాకుండా మంత్రిగా ఓపీఎస్ ఇక కొనసాగేది లేదని.. ఆయన్ని సీఎం చేయడం ద్వారానే అన్నాడీఎంకే పార్టీలో మళ్లీ ముసలం ప్రారంభం కాదని ఓపీఎస్ వర్గం పట్టుబడుతోంది.
 
ఈ నేపథ్యంలో తమిళనాడు రాజకీయాలపై సోషల్ మీడియాలో నెటిజన్లు రకరకాల ట్వీట్లు, పోస్టులతో అభిప్రాయాలు పంచుకుంటున్నారు. తాజాగా తమిళనాడు దివంగత సీఎం జయలలిత భౌతికకాయాన్ని సందర్శించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శశికళను ఓదార్చారు. అప్పట్లో మోడీ తన చేయిని శశికళ నెత్తిపై పెట్టి ఓదార్చే ఫోటోపై చాలా స్టోరీలొచ్చాయి. ఇక శశికళకు తిరుగులేదని, అన్నాడీఎంకెలో జయలలిత మాదిరిగానే ఆమె పెద్ద శక్తిగా మారుతుందంటూ రకరకాల వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.
 
తాజాగా అదే ఫోటో ఇప్పుడు నెట్టింట్లో తెగ హల్‌చల్ చేస్తోంది. మోడీ చేయి పెడితే మటాషేనంటూ రకరకాల క్యాప్షన్స్‌తో హంగామా చేస్తున్నాయి. ఇప్పటికే ఆస్తుల కేసులో శశికళ జైలు జీవితం గడుపుతుండగా, ఆమె మేనల్లుడు దినకరన్ లంచం కేసులో అడ్డంగా బుక్కయ్యాడు. దీంతో ప్రధాని మోడీ దీవెనలు చిన్నమ్మకు ఏమాత్రం కలిసిరాలేదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇంకా జయమ్మ ఆత్మనే చిన్నమ్మను జైలుకు పంపిందని.. పన్నీరుకు మద్దతుగా నిలిచి.. పార్టీ మేలు కోసం దినకరన్‌కు గండికొట్టేలా చేసిందని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

తేజ్ బహదూర్ యాదవ్‌‌పై వేటు.. విధుల నుంచి తొలగింపు.. న్యాయపోరాటానికి సై

బీఎస్ఎఫ్ జవాన్ తేజ్ బహదూర్ యాదవ్‌కు కష్టాలు తప్పట్లేదు. సరిహద్దుల్లో భారత జవాన్లకు ...

news

'దున్నపోతు బాలయ్య' కనిపించడం లేదు... హిందూపురం పీఎస్‌లో ఫిర్యాదు...

సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలృష్ణ కనిపించడంలేదట. దీంతో నియోజకవర్గ ప్రజలు ...

news

బలోచిస్థాన్‌లోనే అతిపెద్ద ఫ్యామిలీ.. ఆయనకు ఆరుగురు భార్యలు.. 54 మంది సంతానం..

ఆయన వయస్సు 70 ఏళ్లు. ఆయనకు ఆరుగురు భార్యలు. 54 మంది పిల్లలు. ఈ వివరాలు బలోచిస్థాన్‌ జనాభా ...

news

నంద్యాల స్థానం మాదే... అభ్యర్థిని ప్రకటిస్తాం... బాబు మాటతో పనిలేదు.. భూమా అఖిల ప్రియ

తన తండ్రి ప్రాతినిథ్యం వహిస్తూ వచ్చిన స్థానం నంద్యాల. ఇపుడు ఆయన మృతితో ఇక్కడ ఉప ఎన్నికలు ...