శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 11 మే 2017 (10:45 IST)

ట్రిపుల్ తలాక్‌‌పై వాదనలు.. శని, ఆదివారాలు పనిచేయనున్న సుప్రీం కోర్టు

ఉత్తరప్రదేశ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం వారణాసిలో ట్రిపుల్ తలాక్‌పై ముస్లిం మహిళల నిరసన రోజురోజుకీ పెరిగుతోంది. ట్రిపుల్ తలాక్ నుంచి తమకు విముక్తి కల్పించాలని కోరుతూ మస్లిం మహిళా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహ

ఉత్తరప్రదేశ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం వారణాసిలో ట్రిపుల్ తలాక్‌పై ముస్లిం మహిళల నిరసన రోజురోజుకీ పెరిగుతోంది. ట్రిపుల్ తలాక్ నుంచి తమకు విముక్తి కల్పించాలని కోరుతూ మస్లిం మహిళా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళలంతా ఇక్కడి హనుమాన్ ఆలయంలో హనుమాన్ చాలీసా పఠించారు. ఈ నేపథ్యంలో ట్రిపుల్ తలాఖ్‌పై గురువారం నుంచి సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం వాదనలు విననుంది. 
 
ఇస్లాంలో బహుభార్యత్వం, ట్రిపుల్ తలాక్, నిఖా హలాలా వంటి వాటికి రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై సుప్రీం కోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఖేహర్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యులతోకూడిన రాజ్యాంగ ధర్మాసనం వాదనలు విననుంది. సున్నితమైన ఈ అంశాన్ని త్వరితగతిన పరిష్కరించే దిశగా.. వేసవి సెలవులైనప్పటికీ శని, ఆదివారాల్లో కోర్టు పనిచేయాలని నిర్ణయించుకుంది. 
 
కాగా, ట్రిపుల్‌ తలాక్‌ రాజ్యాంగ విరుద్ధమని, ఈ విధానం తమ సామాజిక వర్గంలో విపరీతంగా పెరిగిపోతోందని ఐదుగురు ముస్లిం మహిళలతో సహా మొత్తం ఏడుగురు పిటిషన్లు దాఖలు చేశారు.