గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pyr
Last Updated : మంగళవారం, 7 జులై 2015 (21:50 IST)

అందులో తప్పేముంది..? ప‌్ర‌జాభిప్రాయ సేక‌ర‌ణ రాజ్యాంగ విరుద్దం కాదు... ఆప్‌

ప్రజాభిప్రాయ‌ సేకరణ జరపడం రాజ్యాంగ విరుద్ధమేమికాదని ఆమ్ ఆద్మీ పార్టీ నేత దిలీప్ పాండే అన్నారు. గతంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కూడా ఈ డిమాండ్ను తెరమీదకు తెచ్చాయని తెలిపారు. అదే విషయాన్ని తాము డిమాండ్ చేస్తున్నామని ఇందులో ఏమాత్రం తప్పులేదని అభిప్రాయపడ్డారు. ఢిల్లీకి పూర్తి స్ధాయిలో రాష్ట్ర హోదా కల్పించే అంశంపై మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, 1993 తొలిరోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ, భారతీయ ఈ డిమాండ్ తీసుకొచ్చాయని చెప్పారు.
 
కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ ఈ అంశంపై మాట్లాడుతూ.. అరవింద్ కేజ్రీవాల్ అంటున్న ఢిల్లీ పూర్తి రాష్ట్ర హోదా ప్రజాభిప్రాయ సేకరణ అంశం పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని, దీనివల్ల చాలా అనర్ధాలు జరుగుతాయని, అపాయం అని అన్నారు. దీంతో ఆప్ నేత వివరణ ఇచ్చారు. లెఫ్టినెంట్ గవర్నర్తో నిరంతర విభేదాలు పలు అధికారాలు స్వతంత్రంగా చెలాయించలేకపోయిన నేపథ్యంలో దానికి ఏకైక పరిష్కారం ఢిల్లీకి పూర్తి రాష్ట్ర హోదా అని ఆలోచించి ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గత కేబినెట్ సమావేశంలో నొక్కి చెప్పారు.