యేడాదిలో కొడుకు కంపెనీ 16 వేల రెట్లు వృద్ధి... చిక్కుల్లో అమిత్ షా

బుధవారం, 11 అక్టోబరు 2017 (10:32 IST)

భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు అమిత్ షా చిక్కుల్లో పడ్డారు. ఈయన కుమారుడు జయ్ అమిత్ షా సారథ్యంలోని కంపెనీ గత యేడాది కాలంలో ఏకంగా 16 వేల రెట్లు వృద్ధి సాధించింది. అంటే, పెద్ద నోట్లకు ముందు ఈ కంపెనీని మూసివేయడం జరిగింది. ఆ తర్వాత కంపెనీని తిరిగి ప్రారంభించారు. అటు పిమ్మటే ఈ కంపెనీ ఏకంగా 16 వేల రెట్లు వృద్ధిని సాధించినట్టు జయ్ షా ఆదాయపన్ను శాఖకు సమర్పించిన టాక్స్ రిటర్న్స్‌లో పేర్కొన్నారు. 
 
అంటే.. నష్టాల్లో ఉన్న కంపెనీ ఆ తర్వాత రూ.80 కోట్ల మేరకు ఆదాయాన్ని అర్జించింది. దీనికి కారణం అమిత్ షా అని వార్తలు వినిపిస్తున్నాయి. పార్టీలోనే కాదు.. ప్రభుత్వంలోనూ కీలక భూమిక పోషిస్తున్న అమిత్‌షా తన కుమారుడు జయ్‌ షాకు మేలు చేకుర్చేలా వ్యవహరించారన్న ప్రచారం సాగుతోంది. 
 
జయ్‌షా వ్యాపారం ఓ యేడాది వ్యవధిలోనే 16 వేల రెట్లు పెరిగిందని "ది వైర్‌ న్యూస్‌" పోర్టల్‌ కీలక కథనాన్ని ప్రచురించింది. అంతేకాకుండా, జయ్‌షా తన తండ్రి అధికారాన్ని అడ్డపెట్టుకొని కోట్లాది రూపాయల బ్యాంక్‌ రుణాన్ని అక్రమ మార్గాల్లో పొందారని ఈ కథనంలో పేర్కొనడం జరిగింది. ఈ వార్త రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టించింది. జయ్‌ షా వ్యాపారాభివృద్ధి విధానమేంటో ప్రభుత్వం స్పష్టం చేయాలని విపక్షాలు ప్రధాని మోడీని డిమాండ్‌ చేశాయి. ఈ వ్యవహారం అమిత్ షా మెడకు చుట్టుకునేలా ఉంది. దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

పయ్యావులా? కేసీఆర్‌తో నీకెందుకంత సాన్నిహిత్యం?: చంద్రబాబు క్లాస్

పార్టీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్‌పై ఏపీ ముఖ్యమంత్రి, పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ...

news

చంద్రబాబూ నిజాలు తెలుసుకుని మాట్లాడండి.. పయ్యావుల అసహనం

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఆ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ ఆగ్రహం ...

news

ఆరెస్సెస్‌లోని మహిళలు నిక్కర్లు ధరించడం చూశారా?: రాహుల్ గాంధీ

కాంగ్రెస్ ఉఫాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరెస్సెస్‌లోని మహిళలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ...

news

జగన్ మాటే వేదం... రాజీనామాలకు సిద్ధం : వైవీ సుబ్బారెడ్డి

విభాజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు ప్రత్యేక హోదాను ...