శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 26 జులై 2016 (13:15 IST)

కార్గిల్ అమరవీరులకు ప్రధాని మోడీ సెల్యూట్ :: ప్రణబ్ నా వేలు పట్టుకుని నడిపించారు!

కార్గిల్ విజయ దివస్ వేడుకలు మంగళవారం జరిగాయి. కార్గిల్ యుద్ధంలో భారత సైన్యం విజయానికి గుర్తుగా ప్రతి యేటా ఈ వేడుకలను నిర్వహిస్తూ వస్తున్నారు.

కార్గిల్ విజయ దివస్ వేడుకలు మంగళవారం జరిగాయి. కార్గిల్ యుద్ధంలో భారత సైన్యం విజయానికి గుర్తుగా ప్రతి యేటా ఈ వేడుకలను నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ సందర్భంగా అమర జవాన్లకు ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం నివాళులర్పించారు. అనంతరం దేశం కోసం ప్రాణాలర్పించిన వీరజవాన్ల సేవలను కొనియాడారు. చిట్టచివరి శ్వాస వరకూ దేశం కోసమే పోరాడి అమరులైన సాహస జవాన్ల సేవలను దేశం ఎల్లప్పుడూ గుర్తించుకుటుందని, వారి వీరోచిత త్యాగాలు అందిరికీ స్ఫూర్తిగా నిలుస్తాయని ప్రధాని ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు. 
 
కాగా, 1990 కార్గిల్ యుద్ధ సమయంలో సైనికులు చూపిన తెగువ చిరస్మరణీయమని ఆయన అన్నారు. చొరబాటుదారులకు తిరుగులేని జవాబిచ్చి తరమికొట్టారని శ్లాఘించారు. అటల్ బిహారీ వాజ్‌పేయి సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రదర్శించిన రాజకీయ దృఢ వైఖరిని కూడా ఈ సందర్భంగా మోదీ కొనియాడారు. 1999లో అధికారంలో ఉన్న నాయకత్వం తీసుకున్న దృఢమైన నిర్ణయం వల్లే కార్గిల్ విజయం మనను వరించిందని మోడీ ఈ సందర్భంగా అన్నారు. 
 
ప్రణబ్ నా వేలు పట్టుకుని నడిపించారు...
భారత రాష్ట్రపతిగా ప్రణబ్ ముఖర్జీ నాలుగేళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ముఖర్జీపై ప్రధాని నరేంద్ర మోడీ పొగడ్తల వర్షం కురిపించారు. ఆయనను పెద్దన్నగా, మార్గదర్శిగా అభివర్ణించారు. "ఢిల్లీ ప్రపంచంలోకి నేను వచ్చిన వేళ, నాకంతా కొత్తగా అనిపించేది. చాలా విషయాల్లో నాకు అవగాహన ఉండేది కాదు. రాష్ట్రపతి నా వేలు పట్టుకుని నడిపించారు. ఎన్నో అంశాల్లో సలహాలు ఇచ్చారు. ఆయనతో నాకు చాలా దగ్గరి సంబంధాలున్నాయి" అని రాష్ట్రపతి భవన్ మ్యూజియం రెండో దశ ప్రారంభించేందుకు వచ్చిన మోడీ వ్యాఖ్యానించారు.