శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 29 జులై 2015 (09:34 IST)

కలాం శాస్త్రవేత్తగా ఎంత ప్రావీణ్యుడో.. ఇందిరమ్మ వ్యాఖ్యల్ని బట్టి..?

భారత రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం శాస్త్రవేత్తగా ఎంతటి ప్రావీణ్యాన్ని సాధించారో తెలిపే మరో ఘటన వెలుగులోకి చూసింది. విలేకరిగా పనిచేసి రిటైరైన నిశాత్ అహ్మద్ బుధవారం ఫేస్ బుక్‌లో ఓ పోస్టు పెట్టారు. భారత ప్రధాని హోదాలో దివంగత ఇందిరా గాంధీ శ్రీహరికోటలో జరిగిన ఓ రాకెట్ ప్రయోగానికి హాజరయ్యారు. అయితే సదరు రాకెట్ ప్రయోగం విఫలమైంది. 
 
నిప్పులు చిమ్ముతూ నింగికెగసిన ఆ రాకెట్ సముద్రంలో కూలిపోయింది. ఈ సందర్భంగా ఇందిరా గాంధీ ఆసక్తికర వ్యాఖ్య చేశారట. ‘‘ఈ ప్రయోగం విఫలమవడంలో విశేషమేముంది? కలాం సారథ్యం లేకే రాకెట్ కూలిపోయింది’’ అని వ్యాఖ్యానించారట. నాటి ఇందిరాగాంధీ వ్యాఖ్యలను కలాం మరణం నేపథ్యంలో మరోసారి గుర్తు చేసుకున్న నిషాత్ అహ్మద్, అవే వ్యాఖ్యలను ఫేస్ బుక్‌లో పోస్ట్ చేశారు.