గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 22 నవంబరు 2014 (13:10 IST)

ప్రతిపక్ష నేత కూర్చునే సీటు మాత్రం కాంగ్రెస్‌కే దక్కిందోచ్!

లోక్ సభ కనీస బలం లేని కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదాను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సర్కారు ఇప్పటికీ ఇవ్వలేదు. కానీ, ప్రతిపక్ష నేత కూర్చునే సీటు మాత్రం కాంగ్రెస్‌కు దక్కింది. 
 
లోక్ సభలో ప్రతిపక్ష నేత కూర్చునే సీటును మల్లికార్జున ఖర్గేకు కేటాయిస్తూ స్పీకర్ సుమిత్రా మహాజన్ నిర్ణయం తీసుకున్నారు. సభలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేతగా ఖర్గే వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. 
 
స్పీకర్ తాజా నిర్ణయంతో ఇకపై ఖర్గే, తొలి వరుసలో పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, ఎస్పీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్, జేడీ (ఎస్) నేత దేవేగౌడలతో కలిసి కూర్చుంటారు.