Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అక్రమ సంబంధం పెట్టుకున్న భర్త మర్మాంగంపై వేడివేడి నూనె పోసిన భార్య!

బుధవారం, 6 డిశెంబరు 2017 (14:22 IST)

Widgets Magazine
hot cooking oil

అక్రమ సంబంధం మంచిది కాదనీ, సంసారాలు కూలిపోతాయనీ, అందువల్ల ఆ చెడు పని మానుకోవాలంటూ పదేపదే చెప్పింది. కానీ, ఆ భర్త చెవికెక్కలేదు. ఇకలాభం లేదని భావించిన ఆ మహిళ.. సలసల కాగే నూనెను భర్త మర్మాంగంపై పోసింది. ఈ దారుణం చెన్నై మహానగరంలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
చెన్నై నగరానికి చెందిన పి.శశికళ (30), ఎం.పరమేశ్వరన్ అనే దంపతులు ఉన్నారు. అయితే, పరమేశ్వరన్ పక్కింటి మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం భార్యకు తెలియడంతో వారిద్దరి మధ్య అపుడపుడూ గొడవలు జరుగుతూ వచ్చాయి. అయినా అతను మారకపోగా, తన ప్రియురాలి ఇంట్లోనే బస చేస్తూ వచ్చాడు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది. 
 
అయితే, భర్తకు ఎలాగైనా బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్న శశికళ.. భర్తను ఇంటికి పిలిచింది. "ఇకపై మిమ్మల్ని ఏమీ అనను. నాతోనే ఇంట్లో ఉండండి" అంటూ నటిస్తూ ప్రాధేయపడింది. తన అక్రమ సంబంధాన్ని భార్య క్షమించేసిందని, ఇక తనకు తిరుగులేదని భావించిన పరమేశ్వరన్... ఎంతో ఆనందంతో ఇంటికి వెళ్లాడు. 
 
ఆ తర్వాత తన భార్యతో కలిసి పడుకుని గాఢనిద్రలోకి జారుకున్నాడు. బుద్ధి చెప్పేందుకు ఇదే సరైన సమయంగా భావించిన శశికళ బాగా మరిగిన నూనె తెచ్చి మర్మాంగంపై పోసింది. దీంతో పరమేశ్వరన్ గగ్గోలు పెడుతూ బయటకు పరుగులు తీశాడు. తీవ్రంగా గాయపడ్డ పరమేశ్వరన్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

రికార్డింగ్ డ్యాన్సులకు అడ్డొస్తుందనీ... కన్నబిడ్డను చంపేసింది

రికార్డింగ్ డ్యాన్సులకు అడ్డొస్తుందని భావించిన ఓ కసాయి తల్లి తన రెండేళ్ళ బిడ్డను హత్య ...

news

మళ్లీ పవన్ మద్దతిస్తేనే... లేదంటే జగన్ మోహన్ రెడ్డే కింగ్... లగడపాటి సర్వే

ఎపిలో సర్వేలు ఎవరైనా చేయిస్తున్నారంటే అది లగడపాటి రాజగోపాల్ అని ఠక్కున చెప్పేస్తుంటారు. ...

news

విమర్శిస్తే బెదిరిస్తారా... ఏం పీకుతారు మీరు? : పాలకులకు పవన్ ప్రశ్న

ప్రభుత్వ పాలనలోని లోపాలను ఎత్తి చూపి, ప్రభుత్వ పాలనా తీరును విమర్శిస్తే బెదిరిస్తారా? ఏం ...

news

సహచర విద్యార్థినిపై ఆరు మానవ మృగాలు ఇలా ప్రవర్తించాయి (వీడియో)

కళాశాల విద్యార్థులు నీచంగా ప్రవర్తించారు. ఒడిశాలో కొందరు విద్యార్థులు సహచర విద్యార్థినిని ...

Widgets Magazine