Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఇది అమ్మ ప్రభుత్వం కాదు.. శశికళ సర్కారు.. కూల్చేస్తా : జయ సమాధి సాక్షిగా పన్నీర్ శపథం

శుక్రవారం, 17 ఫిబ్రవరి 2017 (06:27 IST)

Widgets Magazine
panneerselvam

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే తిరుగుబాటు నేత ఓ పన్నీర్ సెల్వం భీష్మ ప్రతిజ్ఞ చేశారు. తమ అధినేత్రి, ముఖ్యమంత్రి దివంగత జయలలిత సమాధి సాక్షిగా ఆయన ఈ శపథం చేశారు. 
 
ప్రస్తుతం తమిళనాడులో ఎడప్పాడి కె పళనిస్వామి సారథ్యంలో ఏర్పడిన ప్రభుత్వం జయలలిత ఆశయాలకు అనుగుణంగా ఏర్పడిన సర్కారు కాదని ఆయన ఆరోపించారు. అందువల్ల ఈ సర్కూరును కూల్చివేసేదాకా విశ్రమించబోనని తేల్చి చెప్పారు. 
 
తమిళనాడులో గత కొన్ని రోజులుగా నెలకొన్న రాజకీయ ఉత్కంఠతకు గురువారంతో తెరపడిందని అందరూ అనుకున్నారు. కానీ, పన్నీర్‌ సెల్వం తన మనసులోని మాటను వెల్లడించారు. కొత్త వ్యూహంతో ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. 
 
జయ సమాధికి నివాళులు అర్పించి ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ... అమ్మ ఆశయాలకు వ్యతిరేకంగా ఏర్పడిన పళనిస్వామి ప్రభుత్వాన్ని కూల్చడమే తన లక్ష్యమని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత ప్రభుత్వానికి ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే ఉందని, కానీ తనకు ప్రజల మద్దతు ఉందని అన్నారు. 
 
ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్నవారెవరూ జయ అనుచరులు కాదని, పార్టీని శశికళ వారసత్వ పార్టీగా మార్చేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. రేపటి నుంచి ప్రజల్లోకి వెళ్తామని తేల్చిచెప్పారు. ఇది అమ్మ ప్రభుత్వం కాదు.. శశికళ సర్కార్ అంటూ పన్నీరు సెల్వం వ్యాఖ్యానించారు.
 
ప్రజా వ్యతిరేక ప్రభుత్వం పోరాటం చేయడానికి సిద్ధమవుతున్నట్లు ఆయన తెలిపారు. ప్రతి నియోజక వర్గంలో పర్యటించి అమ్మ ప్రభుత్వం రావాల్సిన ప్రజలకు వివరిస్తామని పన్నీర్ చెప్పారు. జయలలిత ఉన్నంతకాలం దగ్గరకు రాని వాళ్లు ఇప్పుడు పార్టీలో చేరిపోయారని.. ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామని సెల్వం సెలవిచ్చారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Sasikala Jayalalithaa Memorial O Panneerselvam Palaniswamy Govt

Loading comments ...

తెలుగు వార్తలు

news

జైలుకు వెళ్లక ముందే చక్రం తిప్పిన శశికళ : పన్నీర్‌కు పెద్దషాక్

ప్రమాణ స్వీకారం చేసిన గంటలోనే పన్నీర్‌ని ఒంటరిని చేసిన ఘటనకు తమిళనాడు ముఖ్యమంత్రి పళని ...

news

బలాబలాల పోటీలో గెలుపు పళనిదా.. పన్నీర్ సెల్వందా? శనివారమే తుదిపోరు

తమిళనాడులోని ఉత్కంఠ భరిత రాజకీయాలకు శనివారం తెరపడనుంది. సీఎం పళనిస్వామి, మాజీ సీఎం ...

బలాబలాల పోటీలో గెలుపు పళనిదా.. పన్నీర్ సెల్వందా? శనివారమే తుదిపోరు

తమిళనాడులోని ఉత్కంఠ భరిత రాజకీయాలకు శనివారం తెరపడనుంది. సీఎం పళనిస్వామి, మాజీ సీఎం ...

news

సీనియర్‌ని నేనే... చక్రం తిప్పినోణ్ణి నేనే.. చంద్రబాబు టముకు

తొమ్మిదిన్నర ఏళ్లు ముఖ్యమంత్రిగా, పదేళ్లు ప్రతిపక్ష నేతగా.. ఇపుడు మళ్లీ ముఖ్యమంత్రిగా ...

Widgets Magazine