శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 30 మార్చి 2015 (15:32 IST)

దేశ వ్యాప్తంగా గోవధపై నిషేధానికి ప్రయత్నిస్తున్నాం : రాజ్ నాథ్ సింగ్

భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారానికి వచ్చాక.. మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్ రాష్ట్రాలు గోవధపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ నిషేధాన్ని దేశవ్యాప్తంగా కొనసాగించేందుకు ఎన్డీయే ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇదే అంశంపై కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పందించారు. గోవధపై దేశవ్యాప్త నిషేధం విధించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. 
 
మధ్యప్రదేశ్‌లో ఆధ్యాత్మికవేత్తలనుద్ధేశించి ప్రసంగిస్తూ, ఆవులను సంహరించడాన్ని దేశంలో అనుమతించలేమని అన్నారు. దీన్ని నిషేధించడానికి సర్వశక్తులు ఒడ్డుతామని, ఈ విషయంలో ఏకాభిప్రాయం కోసం ప్రయత్నిస్తామని తెలిపారు. భారత్ ప్రపంచంలో పశు మాంసం ఎగుమతిలో రెండో స్థానంలో ఉండగా, వినియోగంలో ఐదో స్థానంలో ఉంది. కాగా దీనిపై ఏకాభిప్రాయం కుదరడం అంత సులువు కాదని రాజకీయ పండితులు అంటున్నారు.