రోజూ గుడికెళ్లే యువతి.. కన్నేసిన 65 ఏళ్ల పూజారి.. తల్లిని చేశాడు..

bihar rape
Last Updated: శుక్రవారం, 12 అక్టోబరు 2018 (14:02 IST)
మహిళలపై వేధింపులు, అరాచకాలు పెచ్చరిల్లిపోతున్నాయి. మీ టూ ఉద్యమం జరుగుతున్నా.. మహిళలపై అకృత్యాలకు పాల్పడే వారి సంఖ్య ఏమాత్రం తగ్గలేదు. తాజాగా జమ్మూకశ్మీర్‌లో దారుణం జరిగింది. యువతిపై ఓ ఆలయ పుజారి ఏడాదిపాటు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో ఆమె గర్భం దాల్చింది. 
 
వివరాల్లోకి వెళితే.. జమ్మూకాశ్మీర్, రేయాసి జిల్లాకు చెందిన ఓ 19 ఏళ్ల యువతి తన గ్రామంలోని గుడికి రోజూ వెళ్లేది. ఈ క్రమంలో గుడిలోని పూజారి (65)తో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ యువతిపై కన్నేసిన వృద్ధ పూజారి యువతిని లోబరుచుకుని ఏడాది పాటు అత్యాచారానికి పాల్పడ్డాడు.

ఈ క్రమంలో ఈ నెల 6వ తేదీన యువతి తీవ్రమైన కడుపునొప్పితో స్థానిక ఆస్పత్రిలో చేరింది. ఆమెను పరీక్షించిన వైద్యులకు గర్భం దాల్చినట్లు అనుమానం రావడంతో జమ్మూలోని ప్రసూతి ఆస్పత్రికి వెళ్లాల్సిందిగా సూచించారు.
 
జమ్మూకు వెళ్లిన యువతికి అక్కడి వైద్యులు సీజేరియన్ చేసి డెలీవరి చేశారు. ఈ క్రమంలో బాలిక మృతశిశువుకి జన్మనిచ్చింది. ఈ ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

కానీ ఇంతలో సదరు వృద్ధ పూజారి తాను దేవుడిగా ప్రకటించుకుని పూజారిగా మారిపోయాడు. అతడి బండారం బయటపడటంతో పారిపోయాడు. ప్రస్తుతం పోలీసులు పూజారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.దీనిపై మరింత చదవండి :