Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

వధువుపై గొడ్డలితో దాడి చేసిన బీజేపీ నేత మొదటి భార్య

గురువారం, 18 జనవరి 2018 (11:38 IST)

Widgets Magazine
axe

జార్ఖండ్ రాష్ట్రంలోని జెంషెడ్‌పూర్‌లో స్థానిక బీజేపీ నేతకు చెందిన భార్య వరకు వధువుపై గొడ్డలితో దాడి చేసింది. అయితే, అదృష్టవశాత్తు ఆ వధువు ప్రాణాలతో బయటపడింది. అప్పటికీ ఆ యువతిని ఆ వివాహిత వదిలిపెట్టలేదు. వెంటపడి పట్టుకునిమరీ చితకబాదింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
పెళ్లి జరుగుతుండగా వరుడి మొదటి భార్య గొడ్డలితో వచ్చి వధువుపై దాడి చేసిన ఘటన జార్ఖండ్‌లో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. జంషెడ్‌పూర్‌లోని స్థానిక సుందర్‌నగర్‌కు చెందిన బీజేపీ నేత సుబోధ్ లోహ్రాకు సునీతా లోహ్రా అనే మహిళతో ఇదివరకే వివాహమైంది. అయితే అదే ప్రాంతానికి చెందిన పూజా కర్మ్‌కార్ అనే మరో యువతితో సుబోధ్ ప్రేమలో పడ్డాడు. ఇద్దరూ గాఢంగా ప్రేమించుకున్నారు. కానీ, పెళ్లికి మాత్రం సుబోధ్ నిరాకరించాడు. దీంతో పూజ పోలీసులను ఆశ్రయించింది.
 
రాజీ కుదిర్చిన పోలీసులు.. తమ బలంతో వారిద్దరికీ పెళ్ళి తంతు కార్యక్రమం మొదలు పెట్టారు. ఈ విషయం సుబోధ్ మొదటి భార్య సునీతాకు తెలిసింది. దీంతో ఆమె ఒక్కసారిగా అపరకాళిగా మారి చేతిలో గొడ్డలి పట్టుకుని పెళ్లి జరుగుతున్న మండపానికి చేరుకుంది. దీంతో పెళ్లికివచ్చిన వారంతా భయభ్రాంతులకు గురయ్యారు. 
 
ఆ తర్వాత వధువుపై దాడికి యత్నించింది. ఆమె తృటిలో తప్పించుకోవడంతో, ఆ తర్వాత వెంటపడిమరీ పట్టుకుని చితక్కొట్టింది. ఆమె బారి నుంచి తప్పించుకున్న పూజ నేరుగా పోలీస్ స్టేషన్‌కు చేరుకుని మొరపెట్టుకుంది. సునీత నుంచి తనను కాపాడాల్సిందిగా వేడుకుంది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

"రియల్ శివగామి"... బిడ్డ ప్రాణానికి తన ప్రాణం అడ్డేసిన తల్లి

ప్రభాస్ హీరోగా, రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన చిత్రం "బాహుబలి". ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ...

news

మేమిద్దరం నవ యువకులం : నెతన్యాహు

భారత పర్యటనలో ఉన్న ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహు ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై ...

news

ఓ మైగాడ్... ఒక్క క్షణం ఆలస్యమైతే? (వీడియో)

చాలామంది ప్రాణాలు పోగొట్టుకునేంతగా సాహసాలు చేస్తుంటారు. తాజాగా చైనాకు చెందిన ఓ వ్యక్తి ...

news

'అన్న' ఎన్టీఆర్‌లా నేను కూడా... రజినీకాంత్ సంచలనం....

తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం 8 నెలల్లోనే అధికారాన్ని కైవసం చేసుకున్న నటుడు ...

Widgets Magazine