శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : శనివారం, 1 జులై 2017 (16:32 IST)

ఫేస్‌బుక్ పరిచయం.. యువకుడిని హతమార్చి.. నగదుతో ఉడాయించిన యువతి..

ఫేస్‌బుక్ మోసాలు పెరిగిపోతున్నాయి. ఫేస్‌బుక్‌లో గుర్తు తెలియని వ్యక్తులను పరిచయం చేసుకోవడం ద్వారా లేనిపోని సమస్యలు కొనితెచ్చుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. తాజాగా ఫేస్‌బుక్‌లో ఓ యువకుడితో పరిచయం చేస

ఫేస్‌బుక్ మోసాలు పెరిగిపోతున్నాయి. ఫేస్‌బుక్‌లో గుర్తు తెలియని వ్యక్తులను పరిచయం చేసుకోవడం ద్వారా లేనిపోని సమస్యలు కొనితెచ్చుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. తాజాగా ఫేస్‌బుక్‌లో ఓ యువకుడితో పరిచయం చేసుకున్న ఓ యువతి అతనిని హతమార్చింది. అతనితో ఏర్పడిన స్నేహాన్ని అదనుగా తీసుకుని.. అతడిని చంపి.. డబ్బు, బంగారం దోచేసుకుంది. 
 
వివ‌రాల్లోకి వెళితే, బీహార్‌లోని ఫుల్వారిషరీఫ్ పోలీసు స్టేషన్ పరిధిలో ఓ యువకుడు దారుణ హత్యకు గురైయ్యాడు. ఈ కేసుపై విచారణ జరిపిన పోలీసులు.. నిందితురాలిగా ఓ యువతిని అరెస్ట్ చేశారు. జార్ఖండ్‌కు చెందిన అంజన కుమారి (24) అలియాస్ అంజన మండల్‌కు ఫేస్‌బుక్ ద్వారా బీహార్‌లోని పాట్నాకు చెందిన మహ్మద్ షాహీమ్‌ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయంతో వీరిద్దరూ ఫుల్వారిషరీఫ్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని ఇమ్లీ ప్రాంతంలో కలుసుకున్నారు. ఇలా మహ్మద్‌కు అంజనపై నమ్మకం ఏర్పడింది. ఆపై అంజనను త‌న దుకాణం వ‌ద్ద‌కు మహ్మద్ తీసుకెళ్లాడు. 
 
కానీ అదే రోజు అంజన అతనని హతమార్చింది. డబ్బుకోసం మహ్మద్‌ను చంపి.. దుకాణంలో ఉన్న నగదు, బైక్ తీసుకుని ప‌రారైంది. అంజ‌న ఆ ఒక్క యువ‌కుడినే మోసం చేయ‌లేద‌ని, సోష‌ల్ మీడియా ద్వారా ఎంతోమంది యువకులను పరిచయం చేసుకుని ఇలాగే మోసం చేసింద‌ని పోలీసులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఆమె వద్ద విచారణ జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.