శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By chitra
Last Updated : సోమవారం, 20 జూన్ 2016 (11:48 IST)

బట్టలు తీసేసి కింద కూర్చుని మహిళతో ఎస్ఐ హాయిగా బాడీ మసాజ్..!

ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్ పోలీస్ స్టేషన్లో ఓ పోలీస్ ఉన్నతాధికారి ఎవ్వరూ చేయని పనిచేసి ఉద్యోగం ఊడగొట్టుకున్నాడు. కర్తవ్యం నిర్వహించి.... బాగా అలిసిపోయాడేమో గాని పోలీస్ స్టేషన్లోనే సబ్ ఇన్‌స్పెక్టర్ సంజ

ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్ పోలీస్ స్టేషన్లో ఓ పోలీస్ ఉన్నతాధికారి ఎవ్వరూ చేయని పనిచేసి ఉద్యోగం ఊడగొట్టుకున్నాడు. కర్తవ్యం నిర్వహించి.... బాగా అలిసిపోయాడేమో గాని పోలీస్ స్టేషన్లోనే సబ్ ఇన్‌స్పెక్టర్ సంజయ్ యాదవ్... ఒక మహిళని పిలిపించి ఆమెతో హాయిగా బాడీమసాజ్ చేయించుకున్నాడు. బాడీ మసాజ్‌కు సంబంధించిన ఆయిల్‌ను దేవ్రియా గ్రామానికి చెందిన ఒక మహిళ ప్రత్యేకంగా తయారు చేస్తుంది. 
 
దీంతో ఆ అధికారి ఏకంగా బట్టలు తీసేసి కింద కూర్చున్నాడు. ఆ మహిళ అతని మీద వాలిపోతూ... నూనెతో శరీరం మొత్తం మసాజ్ చేసింది. మహిళ మసాజ్ చేస్తుంటే.. ఆ పోలీసు హాయిగా రిలాక్స్ కావడాన్ని.. ఆ మహిళ మరిది అక్కడే కూర్చుని వీక్షించాడు. ఈ సంఘటనను చూసి అక్కడ వాళ్లు ఊరికే ఉంటారా... ఆ సపర్యలని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఈ విషయాన్ని డీజీ సీరియస్‌గా పరిగణించారు. విధులలో ఉండగా...ఇలా మహిళతో బాడీ మసాజ్ చేయించుకోవడంపై... విచారణ జరిపించి ఎస్‌ఐను సస్పెండ్ చేశారు.