Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

భర్తలేని సమయంలో ప్రియుడిని ఇంటికి పిలిచి రాసలీలలు.. రెడ్‌హ్యాండెడ్‌గా దొరికారు

శుక్రవారం, 30 జూన్ 2017 (14:27 IST)

Widgets Magazine
beaten

భర్తలేని సమయంలో తన ప్రియుడిని ఇంటికి పిలిపించుకుని శృంగారంలో పాల్గొన్న మహిళను, ప్రియుడిని గ్రామస్థులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని తాటిచెట్టుకు కట్టేసి చితక్కొట్టారు. ఈ ఘటన ఉత్తర బిహార్‌లోని ముజఫర్ నగర్ జిల్లాలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
గోపినాథ్‌పుర్ గ్రామ పంచాయితీకి చెందిన 30 ఏళ్ల మహిళకు అదే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తితో ఎనిమిదేళ్ళ క్రితం వివాహమైంది. అయితే, ఈమెకు పక్క జిల్లా సితామర్హికి చెందిన 27 ఏళ్ల యువకునితో వివాహేతర సంబంధం ఉంది. ఇది గత మూడేళ్లుగా కొనసాగుతోంది. భర్తలేని సమయంలో ఫోన్ చేసి ప్రియుడిని ఇంటికి పిలిపించుకుని శృంగారంలో పాల్గొనేది. 
 
ఈ విషయాన్ని గమనించిన స్థానికులు ఆ మహిళపై ఓ కన్నేశారు. ఈ క్రమంలో బుధవారం ఇంట్లో భర్తలేని సమయంలో ప్రియుడితో ఏకాంతంగా వివాహిత ఉండటాన్ని గ్రామస్తులు గమనించారు. ఆ తర్వాత వారిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని గోపినాథ్‌పుర్ గ్రామ పంచాయితీ ఆదేశాల మేరకు దాదాపు 20 గంటల వరకు బంధించారు. అనంతరం ఇద్దరినీ తాటిచెట్టుకు కట్టేసి కొట్టారు. ఈ దృశ్యాన్ని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది వైరల్ అయింది. 
 
ఈ వైరల్ వీడియో పోలీసుల దృష్టికి వెళ్లడంతో వారు ఆ గ్రామానికి చేరుకుని బాధితులను కాపాడారు. ఈ ఘటనపై రెండు ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారు. వివాహిత ఇచ్చిన ఫిర్యాదుతో ఐదుగురు గ్రామస్తులపై, ఆమె భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు సదరు మహిళతోపాటూ ప్రియుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 
 
అయితే, ఆ వివాహిత తన భర్తను వదిలేసి ప్రియుడితో కలిసి జీవించాలని భావిస్తున్నట్టు డీఎస్పీ కృష్ణమురళికి తెలిపింది. అలాగే, 8 ఏళ్ల కిందటే వివాహమైనా, గత మూడేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నానని సదరు మహిళ అంగీకరించినట్టు పోలీసులు తెలిపారు. మహిళ ఫోన్ చేస్తే ఆమె ప్రియుడు గోపీనాథ్‌పుర్ నుంచి సితామర్హికి వచ్చి వెళ్లేవాడని ఆ మహిళ పోలీసులకు వివరించింది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

మర్మాంగానికి ఉంగరాలు వేసుకున్న ప్రబుద్ధుడు.. కట్ చేసిన వైద్యులు

చేతివేళ్లకు ఉంగరాలు ధరించడం మనం చూసేవుంటాం. కొంతమంది చేతిలోని పదివేళ్లకు ఉంగరాలు ...

news

జీఎస్టీ అంటో ఏంటో తెలియని యూపీ మంత్రి.. ప్రశ్నిస్తే నీళ్లు నమిలారు...

జీఎస్టీ... వస్తు సేవల పన్ను.. ఈ పేరు ఇపుడు దేశవ్యాప్తంగా మార్మోగిపోతోంది. జూలై ఒకటో తేదీ ...

news

మగాళ్లు కూడా ఆత్మహత్య చేసుకుంటారా? మేనకా గాంధీ ఆశ్చర్యం

మగాళ్లు కూడా ఆత్మహత్య చేసుకుంటారా? నేనెప్పుడూ వినలేదే! అంటూ కేంద్ర శిశుసంక్షేమ శాఖ మంత్రి ...

news

వనజాక్షి గీత దాటలేదు.. చింతమనేనిపై చర్య తీసుకోవాల్సిందే...

కృష్ణా జిల్లా ముసునూరు తహసీల్దారు డి.వనజాక్షి గీత దాటలేదని ద్విసభ్య కమిటీ తేల్చింది. ...

Widgets Magazine