Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

భార్యపై అనుమానం... తమిళనాడు ఎక్స్‌ప్రెస్ నుంచి భార్యను తోసేసిన భర్త

బుధవారం, 17 మే 2017 (16:47 IST)

Widgets Magazine
train

అనుమానం పెనుభూతమైంది. ఇంట్లోనే కాదు చివరకు రైలు ప్రయాణంలో కూడా ఈ అనుమానం వదల్లేదు. దీంతో భార్యను వేగంగా వెళుతున్న రైల్లో నుంచి కిందికి తోసేశాడు. ఈ ప్రమాదంలో ఆమె రైలుకింద పడి దుర్మరణం పాలైంది. న్యూఢిల్లీ నుంచి చెన్నైకు వస్తున్న తమిళనాడు ఎక్స్‌ప్రెస్ రైలులో ఈ దారుణం జరిగింది. బుధవారం జరిగిన ఈ సంఘటన వివరాలను పరిశీలిస్తే...
 
ఈ రైలులో భార్యాభర్తలు ప్రయాణం చేస్తున్నారు. వీరిద్దరి మధ్య బుధవారం ఉదయం నుంచి ఘర్షణ పడుతూ వచ్చారు. రైలు ప్రకాశం జిల్లా చిన్న గంజాం మండ‌లం క‌డ‌వ‌కుదురు ద‌గ్గ‌రకు రాగానే భార్యను వేగంగా వెళుతున్న రైలులో నుంచి కిందికి తోసేశాడు. దీంతో ఆమె రైలు చక్రాల కిందపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ విష‌యాన్ని గ‌మ‌నించిన తోటి ప్ర‌యాణికులు వెంట‌నే రైల్వే పోలీసుల‌కి స‌మాచారం అందించారు. 
 
త‌న భార్య‌పై అనుమానంతోనే ఆ వ్యక్తి ఆమెను రైల్లోంచి తోసేశాడ‌ని ప్ర‌యాణికులు పోలీసులకు చెప్పారు. సదరు భార్యాభర్తల పేర్లు సంతోష్ కుమార్, కల్పనగా తెలుస్తోంది. కల్పన ఫోన్లో మాట్లాడుతుండగా ఆమెపై సంతోష్ అనుమానం వ్యక్తం చేసినట్లు సమాచారం. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు, ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు జ‌రుపుతున్నారు. మృతురాలి భర్త సంతోష్ కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

పవన్ కళ్యాణ్ పోటీ చేసే అసెంబ్లీ స్థానం ఏంటో తెలుసా?

వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ అధినేత, హీరో పవన్ కళ్యాణ్ పోటీ చేయడం తథ్యమని తేలిపోయింది. ...

news

మహిళను సీక్రెట్‌గా వీడియో తీశాడు.. ఆమె ఏం చేసిందో తెలుసా? (video)

సింగపూర్ మెట్రో రైలులో ఓ మహిళను సీక్రెట్‌గా వీడియో తీసిన కీచకుడిని పోలీసులు అరెస్ట్ ...

news

కర్నాటక కేడర్ ఐఏఎస్ అధికారి సూసైడ్.. కర్ణాటక మంత్రి ఉమశ్రీనే కారణమా?

కర్నాటక కేడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. అదీ ఉత్తరప్రదేశ్ ...

news

ఇంద్రాణి ముఖర్జీయాతో కార్తీ చిదంబరం లింకు.... ఎలాంటి సంబంధమంటే?

కేంద్ర ఆర్థిక మాజీ మంత్రి చిదంబరం నివాసంపై సీబీఐ సోదాలు జరిపిన తర్వాత ఓ కొత్త విషయం ...

Widgets Magazine