శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 16 ఏప్రియల్ 2016 (11:36 IST)

త్రయంబకేశ్వర్ ఆలయంలో మహిళలు తడిబట్టలు.. సిల్క్ దుస్తులతో రావాలట.. అవసరమా?!

మహారాష్ట్రలోని శని సింగనాపూర్ త్రయంబకేశ్వర్ దేవాలయాల్లో మహిళలకు అనుమతులు ఇవ్వటం తెలిసిందే. అయితే.. త్రయంబకేశ్వర్ గర్భగుడిలోకి ప్రవేశించే మహిళలు విధిగా నూలువస్త్రాలు.. సిల్క్ దుస్తులు ధరించాలని.. తడి దుస్తులతోనే రావాలంటూ నిబంధనను పెట్టారు.

గర్భగుడిలోకి వెళ్లటానికి అనుమతించాలంటూ పోరాడిన పుణెకి చెందిన వనితా గుత్తె అండ్ కో ఇప్పుడీ నిబంధన మీద గుర్రుగా ఉన్నారు. అయితే.. ఈ పోరాటాలు చేసే బృందాల వారు వామపక్ష భావజాలంతో అనుబంధం ఉన్న వారు కావటం గమనార్హం.
 
నిజంగా దేవుడి మీద భక్తి ఉన్నవారు అక్కడి విశ్వాసాలకు విలువ ఇస్తారు. అంతేకాదు మూర్ఖత్వంతో మొండితనంతో తాము కోరుకున్నట్లే జరగాలని అనుకోరు. కోర్టులు సైతం.. ఇలాంటి వారి విషయంలో కాస్త దూకుడుగా వ్యవహరిస్తున్నట్లుగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొంతమంది భావనల్ని సంతృప్తి పర్చటం కోసం.. ఎంతోమంది విశ్వాసాలకు భంగం వాటిల్లేలా కోర్టులు నిర్ణయాలు తీసుకోవటం ఏమిటన్నది ఒక పెద్ద ప్రశ్నగా మారింది.