శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 29 నవంబరు 2015 (19:11 IST)

వాట్సాప్‌లో 15 ఏళ్ల అమ్మాయి 12 నిమిషాల గ్యాంగ్ రేప్ వీడియో: షాక్....

వాట్సాప్‌లో 12 నిమిషాల గ్యాంగ్ రేప్ వీడియో సంచలనం సృష్టించింది. కేరళలో పదవ తరగతి చదువుతున్న ముగ్గురు బాలురు 15ఏళ్ల తోటి విద్యార్థినిపై గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. అయితే ఈ ఉదంతాన్ని ఎవరికీ చెప్పకుండా తనలో దాచుకున్న ఆ బాలిక.. వాట్సాప్‌లో తనను ముగ్గురు స్టూడెంట్స్ రేప్ చేసిన ఉదంతమంతా బట్టబయలుకావడంతో షాక్‌కు గురైంది. వెంటనే పోలీసులను ఆశ్రయించింది. 
 
వివరాల్లోకి వెళితే.. 15 ఏళ్ల బాలిక.. తన తోటి విద్యార్థుడికి స్టడీస్ పరంగా పాఠశాలలో సహకరించేది. పరీక్షలు దగ్గరపడుతున్నందున ఆ అబ్బాయి ఇంటికొచ్చి స్టడీస్ పరంగా సహకరించాలని కోరాడు. తోటి విద్యార్థి కోసం ఆ అబ్బాయి ఇంటికెళ్లిన ఆ బాలిక.. ముగ్గురిచే గ్యాంగ్ రేప్‌కు గురైంది. ఈ ఘటనను రేపిస్టులు వీడియో తీశారు.
 
గార్డియన్లకు కూడా ఈ విషయం చెప్పకుండా సైలెంట్‌గా దాచేసిన ఆ బాలికకు.. తన అత్యాచారానికి సంబంధించిన వీడియో నెట్‌లో రావడం చూసి షాక్ తింది. ఈ వీడియోను వాట్సప్ ద్వారా బాధితురాలి అత్త రిసీవ్ చేసుకోవడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీనిపై బాధితురాలి అత్త పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆపై  ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్న పోలీసులు నలుగురు రేపిస్టులను అరెస్ట్ చేశారు.