శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 26 మే 2017 (11:28 IST)

యూపీలో 24 గంటల్లో ఏడుగురిపై గ్యాంగ్ రేప్.. యోగి సర్కారు ఏం చేస్తోందని.. ?

ఉత్తరప్రదేశ్‌లో సీఎం యోగి ఆదిత్యనాథ్ పాలనకు కళంకం తెచ్చేలా సామూహిక అత్యాచారాలు పెచ్చరిల్లిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లోనే ఏడుగురిపై సామూహిక అత్యాచారాలు జరగడం తీవ్ర కలకలం సృష్టించింది. దీంతో విపక్షాలు

ఉత్తరప్రదేశ్‌లో సీఎం యోగి ఆదిత్యనాథ్ పాలనకు కళంకం తెచ్చేలా సామూహిక అత్యాచారాలు పెచ్చరిల్లిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లోనే ఏడుగురిపై సామూహిక అత్యాచారాలు జరగడం తీవ్ర కలకలం సృష్టించింది. దీంతో విపక్షాలు యోగి పాలనపై ఫైర్ అవుతున్నాయి. యూపీ సీఎంగా యోగి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సామూహిక అత్యాచారాలు పెచ్చరిల్లిపోతున్నాయని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. యోగి ప్రవేశపెట్టిన యాంటీ రోమియో స్క్వాడ్, షీ టీమ్‌లు ఏం చేస్తున్నాయని మహిళా సంఘాలు, ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. 
 
యూపీలోని గౌతమ్ బుధ్ నగర్ జిల్లా సోవాటా దగ్గర అనారోగ్యంతో బాధపడుతున్న బంధువును చూసేందుకు వెళ్తున్న కుటుంబంపై దాడి చేసి.. కారులోని నలుగురు మహిళలపై దుండగులు పాశవికంగా అత్యారానికి పాల్పడ్డారు. వారి నుంచి నగదు, నగలు దోచుకున్నారు. మరో ఘటనలో ముజఫర్ నగర్‌లో ఇద్దరు మైనర్ బాలికలపై సామూహిక అత్యాచారం జరిగింది. మరో ఘటనలో భర్తను చెట్టుకు కట్టేసి, భార్యపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. మహిళలపై జరుగుతున్న అరాచకాలను యోగి సర్కారు అడ్డుకోలేకపోతోందని, యూపీలో రాక్షస పాలన సాగుతోందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి