గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : మంగళవారం, 28 జులై 2015 (18:10 IST)

యాకూబ్ మెమన్‌ ఉరిశిక్ష రద్దుపై జడ్జీల్లో భిన్నాభిప్రాయాలు.. విస్తృత బెంచ్‌కు...

ముంబై వరుస పేలుళ్ళ కేసులో ముద్దాయిగా తేలిన యాకూబ్ మెమన్‌కు విధించిన ఉరిశిక్ష రద్దుపై నెలకొన్న ఉత్కంఠతకు మంగళవారం కూడా తెరపడలేదు. తనకు విధించిన ఉరిశిక్షను రద్దు చేయాలంటూ ఈ దోషి పెట్టుకున్న పిటీషన్‌ను సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం మంగళవారం మరోమారు విచారణ చేపట్టింది. ఆ సమయంలో ఉరిశిక్ష రద్దుపై న్యాయమూర్తుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీంతో ఈ కేసును విస్తృత ధర్మాసనానికి బదిలీ చేస్తూ త్రిసభ్య బెంచ్ నిర్ణయం తీసుకుంది. 
 
ప్రస్తుతం మహారాష్ట్రలోని నాగ్‌పూర్ సెంట్రల్ జైలులో యాకూబ్ మెమన్ శిక్షను అనుభవిస్తున్నారు. సుప్రీంకోర్టు బెయిల్ రద్దు చేసేందుకు నిరాకరిస్తే ముందు అనుకున్నట్టుగా ఈనెల 30వ తేదీన యాకూబ్ మెమన్‌ను ఉరితీయనున్నారు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశారు. అయితే, మెమన్ ఉరిశిక్ష రద్దు పిటీషన్‌పై సుప్రీంకోర్టు బుధవారం విచారణ జరిపి తీర్పును వెలువరించనుంది. దీంతో ఆయన కుటుంబ సభ్యుల్లో తీవ్ర ఉత్కంఠత నెలకొంది.