Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

రాంగ్ ప్లేస్‌లో పార్కింగ్.. సీఎం కాన్వాయ్‌ది అయితే మాత్రం.. లాగిపడేయండి.. దటీజ్ యూపీ ట్రాఫిక్

హైదరాబాద్, శుక్రవారం, 21 ఏప్రియల్ 2017 (04:33 IST)

Widgets Magazine
terror canvoy

రాష్ట్రంలో నేరాలను గణనీయంగా తగ్గిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి ఉపయోగించే కాన్వాయ్‌లోని కారే పోయిందంటే అధికారులు గుండెలు అదిరిపోవా.. అందులోనూ చండశాసనుడైన సన్యాసి ముఖ్యమంత్రి కాన్వాయ్ కారు పోవడం మాటలా.. ఉత్తర ప్రదేశ్‌లో అధికారులను మునిగాళ్ల మీద నిలబెట్టి మరీ పనిచేయిస్తున్న నూతన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కాన్వాయ్ లని కారే చోరీ అయిపోయిందని అధికారులు హడలిపోయారు. చివరకు విషయం తెలిసి బతుకు జీవుడా అని ఊపిరి పీల్చుకున్నారు.
 
ఉత్తరప్రదేశ్‌లో గంటకు మూడు వాహనాలు చోరీకి గురవుతాయని ప్రతీతి. అయితే ఈసారి చోరీ అయింది మాత్రం ఆషామాషీ కారు కాదు.. స్వయానా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కాన్వాయ్‌లోని వాహనం. ఝాన్సీ సర్క్యూట్ హౌస్‌లో పార్కింగ్ చేసిన ఆ వాహనం పోయిందని డ్రైవర్ ఫిర్యాదు చేయగానే జిల్లా పోలీసులు ఒక్కసారిగా హడలిపోయారు. రాష్ట్రంలో నేరాలను గణనీయంగా తగ్గిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి ఉపయోగించే కాన్వాయ్‌లోని కారే పోయిందంటే ఇక ఎలా సమాధానం చెప్పుకోవాలా అని సతమతమయ్యారు. 
 
విషయం ఏమిటింటే... లక్నోకు 300 కిలోమీటర్ల దూరంలో జిల్లా కేంద్రంలో యోగి ఆదిత్యనాథ్ అక్కడి అధికారులతో సమావేశంలో ఉన్నారు. ఆయన కాన్వాయ్ లోని వాహనాలన్నింటినీ పక్కనే ఉన్న సర్క్యూట్ హౌస్ ప్రాంగణంలో పార్క్ చేశారు. సమావేశం జరుగుతోందని డ్రైవర్లు కాసేపు బయటకు వెళ్లి వచ్చారు. అలా వెళ్లొచ్చి చూసుకుంటే ఒక డ్రైవర్ కారు కనపడలేదు. దాంతో అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
 
దాంతో వణికిపోయిన అధికారులు మొత్తం చెక్‌పోస్టులన్నింటినీ అలర్ట్ చేశారు. ఎక్కడైనా వాహనాలను వదిలిపెట్టారేమో తనిఖీ చేశారు. అయితే ఎవరూ అనుకోని చోట ఆ కారు దొరికింది. ట్రాఫిక్ పోలీసుల దగ్గర!! అవును, ఆ వాహనాన్ని ట్రాఫిక్ పోలీసులు టోయింగ్ చేసి తీసుకెళ్లిపోయారు. దాన్ని రాంగ్ ప్లేసులో పార్కింగ్ చేయడం వల్లే టోయింగ్ చేసి పార్కింగ్ కోసం కేటాయించిన ప్రాంతంలో పెట్టారు.
 
అయినా సీఎం కాన్వాయ్ లోని కారును రాంగ్ ప్లేస్‌లో పెట్టడం ఏమిటి.. కారు పోవడం ఏమిటి? 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

పోలీస్ స్టేషన్‌లో సీసీ కెమెరాలు పెట్టి.. బాత్‌రూమ్‌కు వెళితే ఇంట్లోంచి చూస్తూ, గర్భవతిని పెరేడ్ చేయించి.. ఇదిరా పోలీస్!

ప్రజలను కాపాడాల్సిన పోలీసు అధికారి పోలీసు స్టేషన్‌లోనే సీసీ కెమెరాలు పెట్టి మహిళా పీసీలు ...

news

పాతికేళ్లు జైల్లో మగ్గిపోయాక ప్రపంచాన్ని తొలిసారి చూసిన రాజీవ్ హంతకుడు.. మళ్లీ మరోనేరమా?

అది క్షణికావేశమో.. కరడుగట్టిన సిద్ధాంతం ప్రభావమో.. తదనంతర పరిణామాలను ఊహించని అమాయకత్వమో.. ...

news

వివాహేతర సంబంధం... మరొకరితో లింక్ పెట్టుకుందని టీచర్ గొంతుకోసిన మరో టీచర్(video)

మహిళలపై దారుణాలు ఆగడంలేదు. చిత్తూరు జిల్లాలో గురువారం దారుణం ఘటన జరిగింది. గంగవరం మండలం ...

news

ప్రియురాలి కోసం విమానం హైజాక్... హైదరాబాద్ యువకుడు....

పిచ్చి ప్రియులు అని ఇలాంటివారినే అంటుంటారు. తాము అనుకున్నది జరుగకపోతే పిచ్చిపిచ్చి ...

Widgets Magazine