శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : మంగళవారం, 30 మే 2017 (11:30 IST)

సస్పెండ్ చేస్తే ఇక ఇంటికే : యూపీ ప్రభుత్వ అధికారులకు సీఎం షాక్

విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించి, విధులకు డుమ్మాకొడుతూ, క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడే అధికారులకు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వార్నింగ్ ఇచ్చారు. తప్పు మీద తప్పులు చేస్తున్న ప్ర

విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించి, విధులకు డుమ్మాకొడుతూ, క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడే అధికారులకు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వార్నింగ్ ఇచ్చారు. తప్పు మీద తప్పులు చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులను ఇకపై ఎంతమాత్రమూ సహించేది లేదని ఆయన హెచ్చరించారు. 
 
ముఖ్యంగా... క్రమశిక్షణ చర్యల కింద సస్పెన్షన్ వేటుకు గురైన అధికారులు, కొంతకాలం తర్వాత తిరిగి విధుల్లోకి చేరుతున్నారని, ఇకపై అటువంటిది ఉండబోదని చెప్పారు. అధికారి తప్పు చేస్తూ పట్టుబడితే, డిస్మిస్ చేసి శాశ్వతంగా ఉద్యోగానికి దూరం చేస్తామని హెచ్చరించారు. అందువల్ల ప్రభుత్వ అధికారులు మరింత జాగ్రత్తగా విధులు నిర్వహించాలని ఆయన సూచించారు.