Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఆయనే ఓ వివాదాల పుట్ట... కానీ ఇకపై వద్దంటున్నారు.. ఆహా రాజకీయమా..!

హైదరాబాద్, సోమవారం, 20 మార్చి 2017 (09:41 IST)

Widgets Magazine

గత రెండేళ్లకుపైగా ఈ యోగి కమ్ రాజకీయనేత చేసిన వ్యాఖ్యలు దేశంలో ఎంత దుమారం లేపాయో అందరికీ తెలుసు. ముస్లింలు ఎంత ఎక్కువగా ఉంటే అంత అధికంగా అక్కడ గొడవలు జరుగుతాయని వ్యాఖ్యానించారు. మదర్ థరెసా సేవ పేరిట క్రేస్తవుల జనాభా పెంచేందుకు ప్రయత్నించారనీ ఆరోపించారు. ఇలాంటివి ఎన్నో మరి. కానీ అధికారం చేతిలోకి వచ్చేసరికి ఒక్కసారిగా మారిపోయారు. పార్టీ కార్యకర్తలు, నేతలు అనాలోచిత వ్యాఖ్యలు చేయవద్దని ఆదేశం జారా చేసేశారు. ఇది ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ గొడవ.
yogi-adityanath
 
హిందూ అతివాదిగా పేరొందిన యోగి ఆదిత్యనాథ్‌ ముఖ్యమంత్రిగా తన ఇన్నింగ్స్‌ను ఆదివారం ప్రారంభించారు. దేశంలో అత్యంత కీలకమైన ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రానికి ఆయనను సీఎంగా బీజేపీ ఎంచుకోవడంపై పలు విమర్శలు, అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రమాణ స్వీకారం అనంతరం తాను అందరినీ సమానంగా చూస్తానని, ఏ వర్గంపైనా వివక్ష చూపబోనని యోగి పేర్కొన్నారు. తమ ఎన్నికల నినాదమైన ’సబ్‌కా సాథ్‌, సబ్‌కా వికాస్‌’ (అందరికీ చేయూత, అందరికీ ప్రగతి) నేరవేరుస్తానని అన్నారు.
 
సీఎంగా పగ్గాలు చేపట్టిన అనంతరం యోగి పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడుతూ ఘాటు సూచనలు చేశారు. పార్టీ కార్యకర్తలు, నేతలు అనాలోచిత వ్యాఖ్యలు చేయవద్దని ఆయన సూచించినట్టు తెలిసింది. అదేవిధంగా పార్టీ శ్రేణులంతా తమ ఆదాయమూలాలను, ఆదాయ వివరాలను వెల్లడించాలని చెప్పారు.
 
కాగా, సీఎం యోగితో కలిపి 47మందితో కొలువుదీరిన యూపీ కేబినెట్‌లో పలువురు ఆశావహులకు చాన్స్‌ దక్కలేదు. తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందిన కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తనయుడు పంకజ్‌ సింగ్‌కు నిరాశే ఎదురైంది. అదేవిధంగా మాజీ సీఎం కల్యాణ్‌ సింగ్‌ మనవడికి, బీజేపీ సీనియర్‌ నేత లాల్జీ టాండన్‌ తనయుడికి కూడా మంత్రివర్గంలో చాన్స్‌ దక్కలేదు. యూపీ కేబినెట్‌లో చాలావరకు బీజేపీ చీఫ్‌ అమిత్‌ షా సన్నిహితులకు పెద్దపీట దక్కింది. ఆయనకు విశ్వసనీయులుగా ముద్రపడిన శ్రీకాంత్‌వర్మ, సిద్ధార్థనాథ్‌ సింగ్‌, దినేశ్‌ శర్మ, కేశవప్రసాద్‌ మౌర్య తదితరులకు కీలక మంత్రి పదవులు దక్కాయి.
 



Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

జయ మృతిపై అనుమానాలు.. మారథాన్ నిర్వహించ తలపెట్టిన కానిస్టేబుల్ అరెస్ట్

తమిళనాడు దివంగత సీఎం జయలలిత మృతి పట్ల విచారణ జరపాలని డిమాండ్ చేసిన పాపానికి తేని జిల్లా ...

news

జగన్‌కి పొగరెక్కువ.. మనిషికి పొగరు ఎంత ఉండాలో అంతే ఉండాలి: జేసీ

వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డికి పొగరెక్కువని.. మనిషికి పొగరెంత ఉండాలో అంతే ఉండాలని.. ...

news

న్యాయం చేయకపోతే ప్రజలు కోరుకునే శిబిరంలో చేరుతా : శశికళ వర్గ ఎమ్మెల్యే హెచ్చరిక

అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ వర్గానికి చెందిన మరో ఎమ్మెల్యే తిరుగుబాటు ...

news

పళనిస్వామితో ఆడుకుంటున్న ఎమ్మెల్యేలు.. తలపట్టుకుంటున్న చిన్నమ్మ

అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళకు జైల్లో ఉన్నప్పటికీ తిప్పలు తప్పేటట్టు లేవు. ఆమె ...

Widgets Magazine