బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By CVR
Last Updated : శనివారం, 4 జులై 2015 (16:57 IST)

మరుగుదొడ్డి నిర్మించలేదని.... కళాశాల విద్యార్థిని ఆత్మహత్య..

జార్ఖండ్ రాష్ట్రం, తుమ్కా ప్రాంతంలో ఇంటిలో మరుగుదొడ్డి నిర్మించడానికి తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో విరక్తి చెందిన కళాశాల విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన కలకలం రేపింది. వివారాల్లోకి వెళితే.. తుమ్కా జిల్లాలో ఉన్న శాస్త్రినగర్‌కు చెందిన యువతి కుష్బూ కుమారి. కళాశాల విద్యార్థిని అయిన కుష్బూ తమ ఇంట్లో మరుగుదొడ్డి లేకపోవడంతో, తాత ఇంట్లో ఉన్న మరుగుదొడ్డిని ఉపయోగిస్తూ వచ్చింది. ఈ స్థితిలో తన వివాహానికి ముందే ఇంటిలో మరుగుదొడ్డిని నిర్మించాలని తల్లిదండ్రులను పలుమార్లు కోరింది.
 
అయితే ఆమె తల్లిదండ్రులు అందుకు అంగీకరించలేదు. దీంతో విరక్తి చెందిన కుష్బూ కుమారి ఇంటిలో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న తుమ్కా జిల్లా పోలీసులు అక్కడికి చేరుకుని ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 
 
ఈ సందర్భంగా తుమ్కా పోలీసు అధికారి ఒకరు మాట్లాడుతూ... ఇంటిలో మరుగుదొడ్డి నిర్మించనందువలనే ఆ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిపారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా 'నిర్మల్ గ్రామ్' పథకం కింద జిల్లా నిర్వాహకం ద్వారా ఇళ్లలో మరుగుదొడ్లు నిర్మించే విధంగా చర్యలు చేపట్టినట్టు తెలిపారు. దీనిపై ప్రజల్లో అవగాహన తెచ్చేందుకు ఏర్పాటుచేయాలని అధికారులను సూచించామన్నారు.