Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అన్నను పక్కకు నెట్టి పెళ్లికూతురు మెడలో తాళి కట్టిన తమ్ముడు.. పెళ్లికొడుకు ఏడుస్తూ?

శుక్రవారం, 2 జూన్ 2017 (13:22 IST)

Widgets Magazine

ప్రేమ ఎప్పుడు ఎక్కడ ఎలా పుడుతుందో ఎవరికీ తెలియదు. అలా పుట్టిన ప్రేమ ఎంతకైనా తెగించేలా మనిషిని ప్రేరేపిస్తుంది. సాధారణంగా సినిమాలలో జరిగే కొన్ని సంఘటనలు అడపాదడపా నిజ జీవితంలోనూ జరుగుతూ ఉంటాయి. అలాంటి ఘటనే తమిళనాడులో చోటు చేసుకుంది.
 
తమిళనాడులోని ఇలవంపట్టి వెన్‌కల్ సమీపంలోని మురుగన్ ఆలయంలో వివాహం జరుగుతోంది. మరి కొన్ని క్షణాల్లో పెళ్లికొడుకు వధువు మెడలో తాళి కడితే తంతు పూర్తవుతుంది. సరిగ్గా అప్పుడే ఎవరూ ఊహించని విధంగా వరుని తమ్ముడు పెళ్లిపీటలపై ఉన్న తన అన్నని పక్కకు తోసేసి పెళ్లికూతురు మెడలో తాళి కట్టేశాడు. దీనితో అక్కడున్న పెళ్లి పెద్దలంతా అవాక్కయి, తర్వాత అతడిని చితకబాదారు.
 
వివరాలలోకి వెళితే తమిళనాడు వేలూరు జిల్లా తిరుపత్తూరు సమీపంలోని సెల్లరైపట్టికి చెందిన కామరాజ్‌కు రంజిత్, రాజేష్, వినోద్ అనే ముగ్గురు కొడుకులు ఉన్నారు. ఆరు నెలల ముందు రెండో కొడుకు రాజేష్‌కు మధురైకి చెందిన ఒక యువతితో వివాహం నిశ్చయించారు. రాజేష్ పెళ్లి చూపులకు వెళ్లినప్పుడే వినోద్, పెళ్లి కుమార్తె ఒకరినొకరు చూసుకుని, తొలి చూపులోనే ప్రేమలో పడ్డారు. ఆ విషయాన్ని బయటకు చెప్పకుండా అప్పటి నుండి ప్రతిరోజూ ఫోన్‌లో మాట్లాడుకునేవారు.
 
చివరకు పెళ్లి పందిట్లో సంఘటన జరిగిన తర్వాత, పెళ్లి పెద్దలు పెళ్లి కూతురు, వినోద్ ఇద్దరితో మాట్లాడగా అసలు విషయం బయటపెట్టారు. అమ్మాయి కూడా ఇష్టపడుతుండటంతో ఇక పెద్దలు చేసేదేమీలేక అక్షింతలు చల్లి వెళ్లిపోయారు. ఇక పెళ్లి కొడుకు ఏడుస్తూ అక్కడి నుండి వెళ్లిపోయాడు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

బాబు తలపెట్టింది.. నవనిర్మాణ దీక్ష కాదు.. నారావారి నయవంచన దీక్ష: రోజా ఫైర్

తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు కావడంపై ఆ రాష్ట్రంలో సంబరాలు చేసుకున్నారంటే.. ...

news

నా బిడ్డ హత్యను సినిమాగా నిర్మించవద్దు: స్వాతి తండ్రి గోపాలకృష్ణన్

గతేడాది జూన్‌ 24న చెన్నైలోని నుంగంబాక్కం రైల్వే స్టేషన్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ స్వాతి ...

news

రహస్యంగా ప్రేయసిని కలిసేందుకు వచ్చిన రిమాండ్ ఖైదీ.. పోలీసులు పట్టేశారు..

రిమాండ్ ఖైదీని పోలీసులు పక్కా ప్లాన్ ప్రకారం పట్టుకున్నారు. పోలీసులకు చుక్కలు చూపించి ...

news

రాష్ట్రానికి అన్యాయం జరిగిన రోజును మరిచిపోకూడదు.. అదో చీకటి రోజు: చంద్రబాబు

రాష్ట్రానికి ఎంతో అన్యాయం జరిగిన జూన్ 2వ తేదీని ఎవరూ మరిచిపోకూడదని కాబట్టే.. తానిలా ...

Widgets Magazine