శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 28 జులై 2017 (10:55 IST)

బెంగళూరు జూలో ఏనుగుతో సెల్ఫీ.. తొండంతో ఎత్తి.. తొక్కిపారేసింది.. (ఫోటో)

ప్రపంచ వ్యాప్తంగా చిన్నాపెద్దా తేడా లేకుండా వ్యాపించిన ఓ వ్యాధి సెల్ఫీ. దేన్ని చూసినా, ఎవరినీ చూసినా మొబైల్ ఫోన్ తీసి సెల్ఫీ తీసుకోవడం ప్రస్తుతం ఫ్యాషనైపోయింది. ఇంకా సెల్ఫీ తీసుకునేటప్పుడు జరిగే ప్రమా

ప్రపంచ వ్యాప్తంగా చిన్నాపెద్దా తేడా లేకుండా వ్యాపించిన ఓ వ్యాధి సెల్ఫీ. దేన్ని చూసినా, ఎవరినీ చూసినా మొబైల్ ఫోన్ తీసి సెల్ఫీ తీసుకోవడం ప్రస్తుతం ఫ్యాషనైపోయింది. ఇంకా సెల్ఫీ తీసుకునేటప్పుడు జరిగే ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయే వారి సంఖ్య కూడా పెరిగిపోతోంది. తాజాగా బెంగళూరు జూలో మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి ఏనుగుతో సెల్ఫీ తీసుకోవాలనుకున్నాడు. అయితే ఉన్నట్టుండి ఆ ఏనుగు సెల్ఫీ తీసుకున్న వ్యక్తిని తొండంతో ఎత్తుకుని.. కాలితో తొక్కి చంపేసింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. 
 
ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. బెంగళూరు హిమత్ నగరానికి చెందిన అభిలాష్ తన ముగ్గురు స్నేహితులతో కలిసి మంగళవారం సాయంత్రం బన్నెర్‌గట్టా జూకు వెళ్లారు. కానీ ఆ రోజు జూకు హాలిడే కావడంతో జూలోకి అభిలాష్‌తో పాటు అతని స్నేహితులను జూలోకి అనుమతించలేదు. దీంతో ఆ ముగ్గురు దొంగచాటుగా జూలోకి  ప్రవేశించారు. అలా ఏనుగులుండే ప్రాంతానికి ఈ ముగ్గురు వెళ్లినట్లు తెలుస్తోంది. 
 
అభిలాష్ మద్యం మత్తులో ఉన్నట్లు సమాచారం. దాదాపు 20 ఏనుగులున్న ప్రాంతంలో అభిలాష్ సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించాడు. అయితే ఆ ఏనుగు అభిలాష్‌పై దాడి చేసింది. అభిలాష్‌తో వచ్చిన ఇద్దరు స్నేహితులు ఎలాగో తప్పించుకున్నారు. కానీ ఏనుగు దాడిలో అభిలాష్ ప్రాణాలు కోల్పోయాడు.