గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 28 సెప్టెంబరు 2015 (14:44 IST)

షూలో రహస్య కెమెరాతో మహిళలను ఫోటో తీశాడు.. ఎలా? ఎక్కడ?

ఢిల్లీలోని పెద్దపెద్ద షాపింగ్ మాల్స్ వద్ద మహిళలను రహస్యంగా ఫోటోలు తీస్తున్న ఓ పోకిరిని పోలీసులు అరెస్టు చేశారు. షూలో రహస్య కెమెరాని ఏర్పాటు చేసి దానిద్వారా మహిళలు ట్రయల్ రూంలో దుస్తులు మార్చుకునే ఫోటోలు తీస్తూ పట్టుపడ్డారు. ఇతన్ని హర్యానా రాష్ట్ర వాసిగా గుర్తించారు. పైగా, ఈ పోకిరి తండ్రి హర్యానా వినియోగదారుల వేదిక మాజీ అధ్యక్షుడు కావడం గమనార్హం. ఈ కేసు వివరాలను పరిశీలిస్తే.. 
 
ఒక వ్యక్తి తన షూలో రహస్య కెమెరాను ఏర్పాటు చేసుకొని.. పెద్ద పెద్ద షాపింగ్‌మాల్స్‌లో మహిళలు దుస్తులు మార్చుకునే గది వద్దకు వెళ్లి.. దాని ద్వారా ఫొటోలు తీస్తున్నాడు. కెమెరా అమర్చివున్న షూను ధరించిన కాలుని ట్రయల్‌ రూమ్‌ తలుపు కిందుగా కాస్త లోనికి పోనిచ్చి ఆ వ్యక్తి నిల్చొని ఉండటాన్ని షాపింగ్‌ మాల్‌ మేనేజర్‌ గమనించాడు. దీంతో అనుమానం వచ్చిన మేనేజర్‌ ఆ వ్యక్తి దగ్గరికి వెళ్లి విచారించగా.. వెంటనే ఆ వ్యక్తి అక్కడి నుంచి పారిపోయేందుకు యత్నించాడు. 
 
దీంతో సెక్యూరిటీ గార్డ్సు అతనిని పట్టుకుని సోదా చేయగా.. అతని షూలో కెమేరా కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా.. వారు అతనిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద సోదా చేయగా, మొత్తం 12 అసభ్యకర చిత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు చెప్పారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.