Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

బెంగళూరు: బస్టాండ్ వద్ద క్యాబ్ కోసం వేచివున్న యువతి బుగ్గపై ముద్దుపెట్టి?

మంగళవారం, 20 జూన్ 2017 (10:25 IST)

Widgets Magazine
kiss

బెంగళూరులో మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. అమ్మాయిలు కనిపిస్తే చాలు వాళ్లపై ఆగడాలకు పాల్పడుతున్నారు. న్యూ-ఇయర్ సందర్భంగా ఒంటరిగా వెళ్తున్న యువతిపై యువకులు అసభ్యంగా ప్రవర్తించిన సంగతి తెలిసిందే. తాజాగా బస్టాండు వద్ద క్యాబ్‌ కోసం వేచిచూస్తున్న యువతికి ఒక ఆగంతకుడు ముద్దు పెట్టి పరారయ్యాడు. ఈ ఘటనతో బాధితురాలు షాక్ తింది. ఈ ఘటనపై బెంగళూరు జీవనబీమానగర పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే.. యూపీకి చెందిన ఓ యువతి నగరంలోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తోంది. శనివారం రాత్రి తన స్నేహితుల ఇంట్లో పార్టీ ముగించుకుని ఇంటికి బయల్దేరింది. ఆదివారం తెల్లవారుజామున 2.30 సమయంలో జీవనబీమానగర బస్టాండు వద్ద క్యాబ్‌ కోసం వేచిచూస్తోంది. ఇంతలో ఒక వ్యక్తి ఆమె దగ్గరగా వెళ్లి యువతి బుగ్గపై ముద్దుపెట్టి పరుగులు తీశాడు. దీంతో జడుసుకున్న యువతి స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు ఘటనాస్ధలంలో ఉన్న సీసీ టీవీ కెమెరా చిత్రాలను పరిశీలించి పోకిరీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

'నీ స్టయిల్ నాకెంతో నచ్చిందంటూ' గేతో ఫోటో దిగిన డోనాల్డ్ ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నిత్యం ఏదో ఒక వివాదంలో నలుగుతూనే ఉంటారు. ఫ్రాన్స్ మాజీ ...

news

ఎండింగ్‌ మై లైఫ్.. ఐ యామ్ నాట్ హ్యాపీ... భర్తకు భార్య చివరి సందేశం

హైదరాబాద్‌లో బ్యాంకు ఉద్యోగిని అనుమానాస్పద స్థితిలో మరణించింది. ఆమె ఆత్మహత్య చేసుకునే ...

news

కర్ణాటకలో మహిళలు మాయమైపోతున్నారు... ఎందుకు?

కర్ణాటకలో మహిళలు మాయమవుతున్నారు. ఇలా అదృశ్యమవుతున్న మహిళలు వ్యభిచారగృహాల్లో ...

news

ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడి భార్యతో డోనాల్డ్ ట్రంప్‌కు ఎఫైర్ ఉందా?

అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టకముందు డోనాల్డ్ ట్రంప్ మంచి శృంగారపురుషుడే. ఆ దేశంలో ...

Widgets Magazine