శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 7 ఫిబ్రవరి 2016 (11:51 IST)

జికా వైరస్‌కు వ్యాక్సినా.. అంతా ఉత్తుత్తిదే.. హైదరాబాద్ సంస్థపై కేంద్రం సీరియస్

ప్రపంచాన్ని వణికిస్తున్న జికా వైరస్‌కు వ్యాక్సిన్ కనుగొన్నామనీ, అవి ప్రీ క్లినికల్ దశలో ఉన్నాయంటూ హైదరాబాద్‌కు చెందిన బయోటెక్ కంపెనీ ప్రకటించడంపై కేంద్ర ఆరోగ్య శాఖ సీరియస్‌గా స్పందించింది. ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కడా జికా వైర్‌సకు వ్యాక్సిన్‌ అందుబాటులో లేదని, ప్రభుత్వానికి కనీస సమాచారం కూడా ఇవ్వకుండా ఆ కంపెనీ ఎందుకు ప్రకటన చేసిందో తెలుసుకుంటామని కేంద్ర హెల్త్‌ సర్వీసెస్‌ డైరెక్టర్‌ జనరల్‌ (డీజీహెచ్‌ఎస్‌) డాక్టర్‌ జగదీశ్‌ ప్రసాద్‌ అన్నారు. 
 
జికా వైరస్ పరీక్షలు జరిపేందుకు ప్రభుత్వం వద్ద అన్ని రకాల సదుపాయాలూ ఉన్నాయని, జికా పేరు చెప్పుకొని సొమ్ము చేసుకొనే ప్రయత్నం చేయవద్దని ప్రైవేటు సంస్థలను ఆయన హెచ్చరించారు. దేశంలో జికా వైర్‌సను నివారించేందుకు అన్నిరకాల చర్యలూ తీసుకుంటున్నట్లు తెలిపారు. 
 
ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కడా జికా వైర్‌సకు వ్యాక్సిన్‌ అందుబాటులో లేదని, ప్రభుత్వానికి కనీస సమాచారం కూడా ఇవ్వకుండా ఆ కంపెనీ ఎందుకు ప్రకటన చేసిందో తెలుసుకుంటామన్నారు. కాగా భారత బయోటెక్‌ ప్రకటన అనంతరం.. జికా వైరస్‌ నిర్ధారణ పరీక్షలకు సంబంధించి కిట్స్‌ను తాము దిగుమతి చేసుకుంటున్నామంటూ ప్రకటించిన పలు సంస్థలు వెనక్కి తగ్గాయి.