శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 12 ఫిబ్రవరి 2016 (15:23 IST)

కిడ్నాప్ అయిందా? లేదా? సస్పెన్స్: నోరు తెరవని స్నాప్ డీల్ ఉద్యోగి

స్నాప్ డీల్ ఉద్యోగి కిడ్నాప్ అంశంపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. స్నాప్ డీల్ ఉద్యోగి నిజంగానే ఆమె కిడ్నాప్ అయ్యిందా లేదా అనే దానిపై కిడ్నాప్‌కు గురైన యువతి నోరెత్తట్లేదు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్‌లో స్నాప్ డీల్ ఉద్యోగి దీప్తి సర్నా బుధవారం నాడు అదృశ్యమైంది. ఆ రోజు రాత్రి 8 గంటల ప్రాంతంలో ఆటోలో వెళుతూ తన స్నేహితురాలితో మాట్లాడుతూ ఉంది. ఐతే అకస్మాత్తుగా ఆమె పెద్దగా కేకలు వేసింది. ఆమె అలా అరుస్తున్నప్పుడు కొందరు చూశారు కూడా. ఐతే ఆ ఆటో ఆ తర్వాత కనిపించకుండా పోయింది. 
 
ఆ ప్రాంతంలో సీసీ కెమేరాలు కూడా పనిచేయకపోవడమూ, ఆమె ఫోన్ సిమ్ కార్డు కూడా ఆ ప్రాంతంలో పడి ఉండటాన్ని గుర్తించిన పోలీసులు ఏదైనా అఘాయిత్యం జరిగిందేమోనని హడలిపోయారు. దీంతో పోలీసులు జల్లెడపట్టడం మొదలుపెట్టారు. యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ సైతం ఆమె జాడను కనుగొనేందుకు ముమ్మర ప్రయత్నాలు చేయాలని ఆదేశించారు. దాంతో ప్రత్యేక బలగాలు రంగంలోకి దిగాయి. అన్ని ప్రాంతాలను గాలిస్తున్న క్రమంలో ఆమె స్వయంగా తను ఢిల్లీలో ఉన్నాననీ, రైలు ఎక్కి వస్తున్నట్లు తన తండ్రికి ఫోన్ చేసి చెప్పింది.
 
ఐతే ఇప్పుడు సస్పెన్స్ ఏమిటంటే... ఆమె అక్కడకు ఎందుకు వెళ్లినట్లు... ఎవరైనా కిడ్నాప్ చేసి అక్కడికి తీసుకెళ్లారా... లేదంటే ఆమె అక్కడకు వెళ్లిందా... అసలు ఏం జరిగింది అనేది ఇంకా తెలియరాలేదు. తన తల్లి మాత్రం తన బిడ్డ క్షేమంగా ఉంది. ఆమె ఇంటికి వచ్చాక ఏం జరిగిందో అడుగుతాం, ఆటో డ్రైవర్ ఆమెను ఎక్కడికి తీసుకుని వెళ్లాడో కనుగొంటామని ఆమె చెప్పారు.