శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. దసరా
Written By chj
Last Modified: శనివారం, 1 అక్టోబరు 2016 (12:53 IST)

శ్రీ స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి అలంకారం(01-10-2016)

శరన్నవరాత్రి మహోత్సవాలలో అమ్మ వారిని తొలి రోజున ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు స్వర్ణాకవచాలంకృత శ్రీ కనకదుర్గా దేవిగా అలంకరిస్తారు. ఈ అలంకారానికి ఒక విశిష్టత ఉంది. పూర్వం పల్లవ రాజైన మాధవవర్మ అనే మహారాజు విజయవాటికపురిని ప్రజారంజంకంగా పరిపాలించేవాడు. అతన

శరన్నవరాత్రి మహోత్సవాలలో అమ్మ వారిని తొలి రోజున ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు స్వర్ణాకవచాలంకృత శ్రీ కనకదుర్గా దేవిగా అలంకరిస్తారు. ఈ అలంకారానికి ఒక విశిష్టత ఉంది. పూర్వం పల్లవ రాజైన మాధవవర్మ అనే మహారాజు విజయవాటికపురిని ప్రజారంజంకంగా పరిపాలించేవాడు. అతను గొప్ప దేవి భక్తుడు. మాధవ వర్మ కుమారుడు ఒకనాడు పట్టణ పురవీధుల్లో రథం పైకి ఎక్కి వేగంగా వెళ్తుండగా ఆ రథ చక్రాల క్రిందపడి రాజ్యంలోని ఒక బాలుడు మరణిస్తాడు. 
 
శోకతప్తురాలైన ఆ బాలుని తల్లి మాధవవర్మ వద్దకు వెళ్ళి తమకు ధర్మం చేయమని కోరుతుంది. ధర్మమూర్తిగా పేరు గడించిన మాధవవర్మ మరేమీ యోచించకుండా తన కుమారునికి మరణదండన విధిస్తాడు. అతని నిష్పాక్షికతకు, ధర్మపరాయణతకు ఆశ్చర్యం పొందిన దుర్గాదేవి నగరంపై పసిడి వర్షం కురిపించి రాజకుమారుని తిరిగి బతికించిందనే కథ ప్రచారంలో ఉంది. 
 
ఈ రూపంలో అమ్మవారిని దర్శించుకుంటే అష్టకష్టాలు తీరడమే కాకుండా, సమస్త దారిద్య్ర బాధలు తొలగుతాయని భక్తుల విశ్వాసం. చక్కెర పొంగలి నైవేద్యంతో అమ్మవారిని పూజించాలి.