శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. దసరా
Written By Selvi
Last Updated : మంగళవారం, 13 అక్టోబరు 2015 (19:05 IST)

దుర్గమ్మకు ముస్లిం మహిళ నవరాత్రి ఉత్సవాలు: రెండేసి రూపాయల విరాళంతో...?

ఆ దుర్గామాతకు హిందువులు, ముస్లింలు పూజలు చేస్తారు. ఆ దుర్గమ్మకు జరిగే రెండు పూటలా హారతి కార్యక్రమానికి హిందు, ముస్లింలు విధిగా హాజరవుతారట.. ఇదంతా మధ్యప్రదేశ్‌లో జరిగింది. వివరాల్లోకి వెళితే.. దుర్గామాత ఆలయాన్ని పునర్నిర్మించి, దసరా నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తూ మతసామరస్యానికి ఓ ముస్లిం మహిళ ఆదర్శంగా నిలుస్తోంది. 
 
దుర్గామాత ఆలయాన్ని పునర్నిర్మించి, దసరా నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్న ఓ ముస్లిం మహిళ, మత సామరస్యానికి ఆదర్శంగా నిలుస్తోంది  రోజుకూలీ చేసే కార్మికురాలు సుష్రూ బీ(45) గత పదేళ్లుగా తన కుటుంబంతో మంద్ సౌర్ జిల్లాలోని ఇంద్ర కాలనీలో నివాసముంటోంది. సుష్రూ ఇంటిపక్కనే ఉన్న ఆలయంలో దుర్గామాత శీత్లామాతగా కొలువుతీరింది. అయితే శిథిలావస్థలో ఉన్న ఆలయాన్ని పునరుద్ధరించాలనుకుంది. స్థానికుల వద్ద రెండు రూపాయల మేర సేకరించింది. ఈ డబ్బుతో పూజా కార్యక్రమాలు యథావిథిగా నిర్వహిస్తోంది. 
 
మతంతో పట్టింపులు లేకపోవడంతోనే ఆలయాన్ని పునరుద్ధరించామని సుష్రూ చెప్పింది. ప్రపంచానికే దుర్గామాత తల్లిలాంటిదని. అందుకే, హిందు, ముస్లింలు కలిసి ఆలయాన్ని కంటికిరెప్పలా చూసుకుంటున్నామంది. ఇంకా చెప్పాలంటే ఈ దుర్గామాత ఆలయ కమిటీలో హిందువులు, ముస్లింలు సభ్యులుగా ఉండటం విశేషం. ఇకపోతే ఆలయంలో రెండు పూటలా జరిగే హారతి కార్యక్రమానికి హిందు, ముస్లింలు విధిగా హాజరు కావడం గమనార్హం.