Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

శ్రీ గాయత్రీ దేవి అలంకారం(03-10-2016), ఐదు ముఖాలతో అమ్మ(Video)

సోమవారం, 3 అక్టోబరు 2016 (12:50 IST)

Widgets Magazine

ముక్తా విద్రుమ హేమనీల ధవళచ్ఛాయై ర్ముఖై స్త్రీక్షణైః 
ర్యుక్తామిందు నిబద్దరత్నమకుటాం తత్వార్థ వర్ణాత్మికాం 
గాయత్రీం వరదాభయాంకుశకశాశ్శుభ్రం కపాలం గదాం 
శంఖం చక్రమధార వింద యుగళం హస్తైర్వహం తీం భజే    
 
శరన్నవరాత్రులలో మూడవ రోజైన ఆశ్వయుజ శుద్ధ విదియ నాడు అమ్మ గాయత్రీ దేవిగా దర్శనమిస్తుంది. సకల వేద స్వరూపం గాయత్రీ దేవి. అన్ని మంత్రాలకు మూలశక్తి గాయత్రీ దేవి అమ్మవారే. సకల మంత్రాలకు మూలశక్తి అయిన గాయత్రీ దేవి రూపంలో అమ్మను ఆరాధిస్తే అనంత మంత్రశక్తి, బ్రహ్మజ్ఞానం కలుగుతాయని చెబుతారు. ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవళ వర్ణాలు కలిగిన ఐదు ముఖాలతో శంఖం, చక్ర, గద, అంకుశం ధరించి దర్శనమిస్తుంది.
 
ఆదిశంకరులు గాయత్రీదేవిని అనంత శక్తి స్వరూపముగా అర్చించారు. ప్రాతఃకాలములో గాయత్రిగానూ, మధ్యాహ్న కాలములో సావిత్రిగాను, సాయం సంధ్యలో సరస్వతిగానూ ఈమె ఉపాసకులతో ఆరాధనలు అందుకుంటుంది. ముఖములో అగ్ని, శిరస్సులో బ్రహ్మ, హృదయములో విష్ణువు, శిఖపై రుద్రుడు కొలువుంటారని పురాణములు చెబుతున్నాయి. గాయత్రీ ఉపాసన వలన బుద్ధి తేజోవంతము అవుతుంది. గాయత్రీ మంత్ర జపము చతుర్వేద పారాయణ ఫలితాన్ని ఇస్తుంది. గాయత్రీ స్తోత్రములు పారాయణ చేసి రవ్వ కేసరి, పులిహోర నైవేద్యంగా సమర్పించాలి. గాయత్రీ మంత్రం యూ ట్యూబ్ నుంచి వీడియో... చూడండి...Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆధ్యాత్మికం వార్తలు

news

బెస్ట్ పరిశుభ్రమైన ప్రాంతంగా తిరుమల... అవార్డు ఇచ్చిన సీఎం చంద్రబాబు

వచ్చే 2018 అక్టోబర్‌ 2 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్‌గా ...

news

అఖిలాండ బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలు ప్రారంభం.. పట్టువస్త్రాలు సమర్పించనున్న బాబు..

అఖిలాండ బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది. బ్రహ్మోత్సవాల్లో తొలి రోజైన ...

news

తెలంగాణా ప్రాంతపు ముత్తయిదువుల వేడుక ‘బతుకమ్మ’

ఆశ్వయుజ మాసంలో తెలంగాణా ప్రాంతంలో బతుకమ్మ పండుగను వేడుకగా నిర్వహిస్తారు. ఆశ్వయుజ శుద్ధ ...

news

ఇంద్ర‌కీలాద్రిపై ద‌స‌రా ఉత్స‌వాలు ఘ‌నంగా ప్రారంభం.. ఏ రోజు ఏ అవతారం దర్శనం...

విజ‌య‌వాడ‌: అమ్మ‌ల‌గ‌న్న అమ్మ‌, ముగ్గుర‌మ్మ‌ల మూల‌పుట‌మ్మ‌.. బెజ‌వాడ క‌న‌క‌దుర్గ‌మ్మ ...

Widgets Magazine