Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

నవరాత్రి: దుర్గాదేవి ప్రతిమను ఎలా ప్రతిష్టించాలి..

బుధవారం, 6 సెప్టెంబరు 2017 (14:30 IST)

Widgets Magazine
Durga

నవరాత్రులు తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక నియమాలు పాటించాలి. నిష్ఠతో పూజావిధి నిర్వర్తించాలి. తొమ్మిది రోజులు పండ్లు, పాలు మాత్రం సేవించాలి. ఒకే పూట భోజనం తీసుకోవచ్చు. దేవీపూజకి ఇంట్లో ఎక్కడపడితే అక్కడ కాకుండా పూజాగృహంలోగానీ లేక ఇంట్లో తూర్పు దిక్కుగా వుండేట్లు సమప్రదేశం చూసుకోవాలి. ఆ ప్రాంతంలో పసుపు నీళ్ళు చల్లి శుద్ధిచేసి పూజాస్థలంగా నిర్ధేశించుకోవాలి.
 
పువ్వుల మాల, తోరణాలతో ఆ ప్రాంతాన్ని అలంకరించుకోవాలి. అమావాస్య రాత్రి ఉపవాసం ఉండి మరునాడు పాడ్యమి తిథి నాడు దేవి ప్రతిమను ప్రతిష్టించాలి. దుర్గాదేవిని పూజించాలి. సింహవాహనం, త్రిశూలం ధరించిన దుర్గాదేవిని పూజించాలి. 
 
పాడ్యమినాడు వేదోక్తంగా ప్రతిష్టించిన ప్రతిమ ముందు కలశంపై కొబ్బరికాయ వుంచి, నూతన వస్త్రం కప్పి దేవీమాతను దానిపై ఆవాహన చేసి షోడపశోపచార పూజా విధులతో వేద బ్రాహ్మణుల సహాయంతో పూజ నిర్వర్తించాలి. దేవీ సహస్రనామపారాయణ అష్టోత్తర శత నామావళి, త్రిశతి మొదలైనవి చదువుతూ పుష్పాలతో పూజించడం పరిపాటి. బంతి, కనకాంబరం, చేమంతి, జాజి అన్ని రకాల పుష్పాలు దేవీమాతకు ప్రీతికరమని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు. 
 
పూజానంతరం నైవేద్యంగా పులగం, పొంగలి, పాయసం, చిత్రాన్నం, గారెలు మొదలైన వివిధ భక్ష్యాలు శక్త్యానుసారం సమర్పించాలి. నవరాత్రుల దీక్షాకాలంలో భూమిమీద శయనించడం, బ్రహ్మచర్యం పాటించడం తప్పకుండా ఆచరించాలి. దశమి రోజున జమీ వృక్షాన్ని పూజించాలి. ఆయుధ పూజ రోజున వాహనాలను, ఆయుధాలను పూజించాలని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Navratri 2017 Earth Navratras Lakshmi Saraswati Vijayadashami Devi Durga

Loading comments ...

ఆధ్యాత్మికం వార్తలు

news

అయ్యో.. ఉదయం లేవగానే అద్దాన్ని చూశారా..?

చాలామంది ఉదయం లేవగానే అద్దాన్ని ముందుగా చూసి అందులో తమ ముఖాన్ని చూసుకుంటుంటారు. చాలామంది ...

news

శ్రీవారి ఆనంద నిలయం విశిష్టత (వీడియో)

తిరుమల వేంకటేశ్వరుడి ఆనంద నిలయాన్ని చూడగానే మది పులకించిపోతుంది. ఇంతటి మహత్తరమైన నిర్మాణం ...

news

మంగళసూత్రం ఇలా వేసుకుంటే వందేళ్ళు సౌభాగ్యం...

మన దేశంలో వివాహాలు చేసుకునే హిందువులు మంగళసూత్రాన్ని భార్యకు కడతారు. ఇది ఎంతో పవిత్రమైన ...

news

బక్రీద్ సంబరాలు... ముస్లిం సోదరులతో కిక్కిరిసిన మసీదులు

ముస్లిం సోదరుల పవిత్ర పండుగల్లో ఒకటైన బక్రీద్. ఈ పండుగ త్యాగానికి ప్రతీక. ఈ సందర్భంగా ...

Widgets Magazine