బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. మాంసాహారం
Written By Selvi
Last Updated : శనివారం, 6 జూన్ 2015 (18:52 IST)

పిల్లలకూ, పెద్దలకూ మంచి పౌష్టికాహారం ఆలూ ఆమ్లెట్

ఆలుగడ్డలతో చిప్స్ తినివుంటాం. వివిధ కూరలు ట్రై చేసి వుంటాం. అయితే ఈసారీ ఎగ్‌తో ఆలూ ఎగ్ ఆమ్లెట్ ఎలా చేయాలో చూద్దాం. సాధారణంగా ఆమ్లెట్‌ను చాలా రకాలుగా తయారుచేసుకోవచ్చు. డైట్ ను పాటించే వాళ్ళు పచ్చసొన ఫాట్, కొలెస్ట్రాల్ శాతం అధికం అనుకొనే వాళ్ళు ఎగ్ వైట్‌తో ఆమ్లెట్ చేసుకొని తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. 
 
అయితే మరింత టేస్టీగా మరిన్ని పోషకాలు, క్యాలరీలు శరీరానికి అందివ్వాలంటే అందులో ఆలూ కూడా జత చేసి ఆమ్లెట్ తయారు చేసుకొని తీసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇది పిల్లలకూ పెద్దలకూ మంచి పౌష్టికాహారం. అల్పాహారం. మరి ఆలూతో ఎగ్ ఆమ్లెట్ ఎలా చేయాలో చూద్దాం.. 
 
కావలసిన పదార్థాలు: 
ఆలుగడ్డలు: పావు కేజీ 
కోడి గుడ్లు: ఐదు
పాలు: మూడు టేబుల్ స్పూన్లు 
ఉల్లిపాయలు: అరకప్పు 
మిరియాలపొడి: అర టీ స్పూన్
ఉప్పు: రుచికి తగినంత 
వెన్న: నాలుగు స్పూన్లు 
 
తయారీ విధానం : 
ముందుగా ఆలుగడ్డల్ని ఉడికించి తొక్క తీసి పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలో కోడి గుడ్ల సొన వేసి బాగా గిలకొట్టాలి. తర్వాత అందులోనే ఉప్పు, మిరియాలపొడి, వెన్న, ఉల్లిపాయ ముక్కలు, పాలు వేసి మళ్లీ గిలకొట్టాలి. చివరిగా ఉడికించిన ఆలుగడ్డ ముక్కల్ని వేసి బాగా కలిపి వెడల్పాటి గిన్నెలో వేసి ఓవెన్‌లో పెట్టి బేక్ చేయాలి. లేదంటే దళసరి పెనంపై ఆమ్లెట్‌లా వేసుకున్నా బాగుంటుంది. అంతే హెల్తీ న్యూట్రీషియన్ ఆలూ ఆమ్లెట్ రెడీ.